Kalki 2898 AD USA Box Office: యూఎస్‌లో ప్రభాస్ హిస్టరీ.. షారూక్, ఎన్టీఆర్, చరణ్ రికార్డులు ఔట్
తెలుగు సినిమాలో కొంత మంది హీరోలు మాత్రమే దేశ వ్యాప్తంగా మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. కొంత కాలంగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతోన్న అతడు.. క్రమంగా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' అనే చిత్రంతో వచ్చాడు. టైం ట్రావెల్ కథతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం రికార్డుల సునామీని సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 'కల్కి 2898 ఏడీ' సరికొత్త హిస్టరీని నమోదు చేసింది. ఆ వివరాలను మీరే చూడండి!
హాలీవుడ్ రేంజ్‌లో కల్కి
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇచ్చాడు.

అలాంటి టాక్‌తో 200
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో హైప్ ఏర్పడింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని జూన్ 27వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. చిత్ర యూనిట్ నమ్మకాన్ని నిలబెడుతూ ఇది పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. అలాగే రెస్పాన్స్‌ను సైతం రాబట్టేసి రూ. 200 కోట్ల వరకూ గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
యూఎస్‌లో అదుర్స్
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' మూవీ రిలీజ్ జూన్ 27వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ 20 రోజుల ముందే ఓపెన్ అయ్యాయి. అక్కడ ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో విడుదలకు ముందే ప్రభాస్ సినిమా నార్త్ అమెరికాలోనే రూ. 30 కోట్లు వరకూ గ్రాస్ వసూళ్లు కూడా సాధించింది.

ప్రీమియర్స్‌తో రికార్డు
మిగిలిన ప్రాంతాల కంటే నార్త్ అమెరికాలో 'కల్కి 2898 ఏడీ' సినిమాకు మరింత ఎక్కువ స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం ఒక్క ప్రీమియర్స్ ద్వారానే 3.85 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. తద్వారా అత్యధిక ప్రీమియర్స్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇది రికార్డు సాధించింది. తద్వారా ప్రభాస్.. షారూక్ ఖాన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలను వెనక్కి నెట్టాడు.
మరో మార్కుకు దాటి
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి యూఎస్‌లో అద్భుతమైన రీతిలో బుకింగ్స్ సాగుతున్నాయి. అక్కడ ప్రీమియర్స్ ద్వారా 3.85 మిలియన్ డాలర్లను సాధించిన ఈ చిత్రం.. మొదటి రోజు 1.15 మిలియన్ డాలర్లను రాబట్టింది. తద్వారా అప్పుడే నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుని హిస్టరీ క్రియేట్ చేసింది.

టాప్‌లో.. ప్రభాస్‌కు 4
నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుని సత్తా చాటింది. తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరిన చిత్రంగా ఇది చరిత్రను సృష్టించింది. అంతేకాదు, 5 మిలియన్ మార్కును చేరుకున్న ప్రభాస్ నాలుగో చిత్రంగానూ 'కల్కి 2898 ఏడీ' మరో రికార్డును అందుకుంది.


Click it and Unblock the Notifications











