Kalki 2898 AD: RRR కలెక్షన్లను దాటేసిన కల్కి.. రాజమౌళి రికార్డు బ్రేక్ చేసేసిన ప్రభాస్
కల్కి 2898 ఏడీ.. కల్కి 2898 ఏడీ.. కల్కి 2898 ఏడీ కొద్ది రోజులుగా ఇండియా వ్యాప్తంగా రీసౌండ్ వస్తున్న పేర్లలో ఇది ఒకటి. అంతలా ఈ చిత్రం ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రం రికార్డు వసూళ్లతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' నార్త్ అమెరికాలో RRR మూవీ రికార్డును బ్రేక్ చేసింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!
హాలీవుడ్ రేంజ్‌లో కల్కి
ప్రభాస్ నటించిన హాలీవుడ్ రేంజ్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇచ్చాడు.

భారీ స్థాయి రెస్పాన్స్‌తో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీని హై రేంజ్‌లో రూపొందించారు. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందరి నమ్మకాన్ని నిలబెట్టిన ఈ చిత్రం ఆరంభంలోనే మంచి టాక్ అందుకుంది. ఫలితంగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటూ ఈ చిత్రం రూ. 750 కోట్లు వసూళ్లతో రికార్డులు సాధించింది.

అక్కడ మాత్రం ఫుల్లు
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి నార్త్ అమెరికాలో టికెట్ బుకింగ్స్ చాలా రోజుల క్రితమే మొదలయ్యాయి. ఎవరూ ఊహించని రీతిలో అక్కడ ఈ చిత్రానికి దిమ్మతిరిగే రెస్పాన్స్ కూడా సొంతం అవుతోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే రాబడుతోంది. ఇలా రిలీజ్ ముందే ప్రభాస్ సినిమా రికార్డులన్నీ నమోదు చేసుకుంది.

మరో మార్కును దాటి
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి యూఎస్‌లో టికెట్ల అమ్మకాలు అద్భుతమైన రీతిలో సాగుతున్నాయి. అక్కడ అన్ని ఏరియాల కంటే ఈ చిత్రం ఎక్కువగా రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా వసూళ్లు భారీగా కలెక్ట్ చేస్తోంది. ఇలా ఈ సినిమా యూఎస్‌లో అప్పుడే 14.5 మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటేసింది.

RRR రికార్డు క్రాస్ చేసి
నాగ్ అశ్విన్ రూపకల్పనలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు నార్త్ అమెరికాలో దిమ్మతిరిగే స్పందన లభిస్తోంది. తద్వారా ఇది విడుదలైన తొమ్మిది రోజుల్లోనే 14.5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకోవడంతో పాటు RRR లైఫ్ టైం కలెక్షన్ల (14.2) రికార్డును కూడా ఈ చిత్రం బ్రేక్ చేసి సత్తా చాటుకుంది.


Click it and Unblock the Notifications











