Kalki 2898 AD: RRR రికార్డు బ్రేక్ చేసిన కల్కి.. భారత సినీ చరిత్రను తిరగరాసిన ప్రభాస్
రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు ఇప్పుడు ఇండియాలో ఒక సంచలనం. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా భారతదేశ వ్యాప్తంగా తనదైన రీతిలో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలతో మెప్పిస్తోన్న ఈ బడా హీరో.. తన రేంజ్‌ను ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇప్పుడు ఈ పాన్ ఇండియా స్టార్ 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాతో వచ్చాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ క్రేజీ సినిమా తాజాగా RRR రికార్డును బ్రేక్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
విజువల్ వండర్‌గా
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేశారు.

కల్కి హడావిడితోనే
'కల్కి 2898 ఏడీ' మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను మే 9వ తేదీనే రిలీజ్ చేద్దామని మొదట భావించారు. కానీ, అలా వీలు కాకపోండంతో జూన్ 27న తీసుకు వచ్చేశారు. ఇందుకోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించి సినిమాను ప్రేక్షకులకు చేరువగా చేశారు. ఫలితంగా కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా ఇదే సినిమా హడావిడి పెరుగుతూ వచ్చింది.

అలాంటి టాక్‌తోనే
పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి యూఎస్ సహా విదేశాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అదే సమయంలో ఇండియాలోనూ ఇప్పటికే షోలు పూర్తి అయ్యాయి. అన్ని ఏరియాల్లోనూ దీనికి మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.

యూఎస్‌లో ఫుల్లు
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్సైన తర్వాత.. ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ముందే ఓపెన్ అయ్యాయి. అక్కడ ఈ చిత్రానికి ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. ఇలా ఇప్పటికే రూ. 30 కోట్లు వరకూ గ్రాస్ వసూళ్లు లభించాయి.

ఆ మార్కును దాటి
ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ దిమ్మతిరిగిపోయేలా సాగుతున్నాయి. అక్కడ 500 లొకేషన్లలో 3000 షోలకు గానూ ఇప్పటికే 1.5 లక్షలకు పైగా టికెట్లు కూడా అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇలా ఈ సినిమా యూఎస్‌లో అప్పుడే 3.5 మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకుని చరిత్రను సృష్టించింది.

చరిత్ర సృష్టించి
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు నార్త్ అమెరికాలో బీభత్సమైన స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం ప్రీమియర్స్ ద్వారానే 3.5 మిలియన్ డాలర్లను రాబట్టింది. తద్వారా ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన RRR (3.46 మిలియన్లు) రికార్డును బ్రేక్ చేసింది. దీంతో ప్రభాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.


Click it and Unblock the Notifications











