Kalki 2898 AD: హైదరాబాద్ గడ్డపై చరిత్ర సృష్టించిన కల్కి.. అప్పుడే అన్ని కోట్లతో పెను సంచలనం
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమదైన సినిమాలతో దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. ఈ మధ్య కాలంలో భారీ సినిమాలు చేస్తోన్న అతడు.. తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ పాన్ ఇండియా హీరో 'కల్కి 2898 ఏడీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం హైదరాబాద్ గడ్డపై చరిత్రను సృష్టించింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
కల్కిగా ప్రభాస్ అరాచకం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమానే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు నటించారు.

వరల్డ్ వైడ్‌గా అదే ఊపు
ఆరంభం నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8500లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లన్నీ నిండిపోయాయి. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఊపును చూపిస్తోంది.
టాక్‌కు తగ్గట్టే రెస్పాన్స్
టైం ట్రావెల్ స్టోరీతో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించిన షోలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పడిపోయాయి. ఈ మూవీకి టాక్ కూడా డీసెంట్‌గానే లభించింది. అంతటా దీనికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. చాలా ప్రాంతాల్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌ను మొదలు పెట్టగా.. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడు అయిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో రికార్డులు కొట్టింది.
హైదరాబాద్‌లో రికార్డ్‌లే
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో సాధారణ రెస్పాన్స్‌ను అందుకుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇది భారీ స్పందనతో దూసుకుపోతోంది. ఇలా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే హైదరాబాద్ నగరంలో ప్రభాస్ చిత్రం మొదటి రోజు రూ. 16.20 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

చరిత్ర సృష్టించిందిగా
విజువల్ వండర్‌గా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీ హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలోనే గతంలో 'సలార్: సీజ్‌ఫైర్' రూ. 12.11 కోట్లు, 'RRR' మూవీ పేరిట ఉన్న రూ. 10.57 కోట్లు రికార్డును బ్రేక్ చేసేసింది. ఈ రికార్డుతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











