Kalki 2898 AD Day 1 Collection: ప్రభాస్ ఊచకోత.. తొలి రోజే వందల కోట్లు.. ఆ సినిమాల రికార్డులన్నీ బ్రేక్
కల్కి 2898 ఏడీ.. కల్కి 2898 ఏడీ.. కల్కి 2898 ఏడీ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోన్న పేర్లలో ఇది అన్నింటి కంటే ముందు ఉంది. దీనికి కారణం ఈ సినిమా అంతలా ప్రభావాన్ని చూపిస్తోంది. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి టాక్‌తో పాటు రెస్పాన్స్ కూడా అదిరిపోయేలా లభించాయి. ఫలితంగా ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. మరి 'కల్కి 2898 ఏడీ' తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!
కల్కిగా ప్రభాస్ ఊచకోత
తెలుగు హీరో ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు చేశారు.

కల్కి బిజినెస్ ఎంతంటే
'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలుపుకుని రూ. 370 కోట్లు వ్యాపారం జరిగింది.
అలాంటి టాక్‌తో భారీగా
టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాకు మొదటి రోజు అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేసిన విషయం తెలిసిందే.

తొలి రోజు వంద కోట్లతో
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 48 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 50 కోట్లు రాబట్టింది. ఇలా మొదటి రోజు దాదాపు రూ. 100 కోట్లు షేర్‌తో పాటు రూ. 200 కోట్లు గ్రాస్‌ను ఇది వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











