Kalki 2898 AD: బాలీవుడ్‌లో ప్రభాస్ నయా హిస్టరీ.. టాప్ మూవీగా కల్కి రికార్డు
తెలుగు సినిమా స్థాయిని పెంచే చిత్రాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచే ఆ తరహా సినిమాలు రూపొందుతోన్నాయి. ఇలా ఇప్పటికే అతడు పలు సినిమాలతో వచ్చి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఇటీవలే అతడు నటించిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమా బాలీవుడ్ తాజాగా ఓ సంచలన రికార్డును నమోదు చేసుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసమే!
మల్టీస్టారర్‌గా కల్కి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు చేశారు.

టాక్‌కు తగ్గట్లుగానే
ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8500లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేసుకున్నారు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. దీంతో ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. అలా వరల్డ్ వైడ్‌గా ప్రభాస్ నటించిన ఈ క్రేజీ మూవీ హవాను చూపిస్తోంది.

1000 కోట్లతో రచ్చ
విభిన్నమైన కాన్సెప్టుతో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి మొదటి రోజు నుంచే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా ప్రభాస్ సినిమా ఏమాత్రం తగ్గకుండా ఇదే హవాను చూపిస్తోంది. ఫలితంగా ఈ మూవీ రూ. 1000 కోట్లకు చేరువగా వచ్చింది.

హిందీలో సూపర్
ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా కోసం దేశ వ్యాప్తంగా బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీన్ని హిందీలో కూడా అత్యధిక థియేటర్లలో తీసుకు వచ్చారు. అనుకున్నట్లుగానే అక్కడ కూడా ఇది మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం హిందీలో రూ. 220 కోట్లు వరకూ నెట్ వసూళ్లను సాధించి సత్తా చాటుకుంది.

టాప్ మూవీగానే
'కల్కి 2898 ఏడీ' మూవీ హిందీలో అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. ఫలితంగా ఇది అక్కడ భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇలా ఇప్పటికే రూ. 220 కోట్లు నెట్ వసూలు చేసింది. తద్వారా 2024లో హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీని క్రాస్ చేసేసింది.


Click it and Unblock the Notifications











