Kalki 2898 AD: ప్రభాస్ ఖాతాలో దిమ్మతిరిగే రికార్డు.. 70 ప్లస్ 70 కోట్లతో సరికొత్త చరిత్ర
తెలుగు సినిమా పరిశ్రమలోకి పెద్ద బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. తనదైన చిత్రాలతో సందడి చేస్తూ పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో భారీ సినిమాల్లో నటిస్తోన్న అతడు.. మరింత జోష్‌తో ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నైజాం ఏరియాలో ఓ రికార్డును సాధించింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
టైం ట్రావెల్ స్టోరీతో కల్కి
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన టైం ట్రావెల్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇచ్చారు.

భారీ రెస్పాన్స్‌తో ఫుల్లుగా
రెబెల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీ జూన్ 27న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి భారీ స్థాయిలో స్పందన కూడా లభిస్తోంది. ఇలా ఈ సినిమా ఇప్పటికే రూ. 800 కోట్లు వసూళ్లను కూడా సాధించింది.
నైజాంలో టార్గెట్ కంప్లీట్
రెబెల్ స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. మరీ ముఖ్యంగా నైజాం ఏరియాలో దీనికి ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ. 65 కోట్ల టార్గెట్‌ను చేరుకుని లాభాల్లోకి వచ్చేసింది.

నైజాంలోనే అన్ని కోట్లు
'కల్కి 2898 ఏడీ' మూవీకి అన్ని ఏరియాల్లోనూ ఇప్పటికి కూడా షోలు ఫుల్ అవుతున్నాయి. అయితే, అన్నింటి కంటే కంటే నైజాం ఏరియాలో అత్యధిక రెస్పాన్స్ వచ్చింది. అక్కడ ప్రభాస్‌కు ఎక్కువ మార్కెట్ ఉండడంతో ఆ ఒక్క ప్రాంతంలోనే ఎక్కువ స్క్రీన్లలో ఇది విడుదలైంది. ఫలితంగా ఈ సినిమాకు నైజాంలో ఇప్పటి వరకూ రూ. 73 కోట్లు షేర్‌ను వసూలు చేసింది.

నైజాం గడ్డపై సంచలనం
'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో ఇప్పటికే రూ. 73 కోట్లు షేర్ వచ్చింది. దీంతో ఈ గడ్డపై అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. అదే సమయంలో వరుసగా రెండు సార్లు రూ. 70 కోట్లు షేర్ సాధించిన హీరోగా ప్రభాస్ రికార్డు సాధించాడు. గతంలో అతడు 'సలార్: సీజ్‌ఫైర్' చిత్రంతో నైజాంలో రూ. 71.40 కోట్లు షేర్‌ను వసూలు చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











