Kalki 2898 AD: నైజాం గడ్డపై ప్రభాస్‌కు బిగ్ షాక్.. ఆ రెండు సినిమాల కంటే తక్కువగా కల్కి
తెలుగు సినిమా నుంచి వచ్చిన వారిలో కొందరు మాత్రమే దేశ వ్యాప్తంగా స్టామినాను చూపిస్తూ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ పేరును ముందుగా చెప్పుకోవాలి. అంతలా అతడు తనదైన చిత్రాలతో కొంత కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే భారీ బడ్జెట్ సినిమాలతో అలరిస్తున్నాడు. ఇలా ఇప్పుడు ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాను చేశాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి నైజాం ఏరియాలో ఊహించని షాక్ తగిలింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
క్రేజీ కాన్సెప్టుతో వచ్చింది
ప్రభాస్ నటించిన క్రేజీ కాన్సెప్టు మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.

అలాంటి టాక్.. సంబరాలే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. ఇందులో ప్రభాస్ ఇరగదీసేశాడని అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. దీంతో అటు అతడి ఫ్యాన్స్.. ఇటు చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది.
తొలి రోజు రికార్డు వసూళ్లు
రెబెల్ స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా దీనికి రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

నైజాంలోనే అన్ని కోట్లతో
'కల్కి 2898 ఏడీ' మూవీకి అన్ని ఏరియాల్లోనూ మొదటి రోజు షోలు ఫుల్ అయిపోయాయి. అయితే, అన్నింటి కంటే కంటే నైజాం ఏరియాలో అత్యధిక రెస్పాన్స్ వచ్చింది. అక్కడ ప్రభాస్‌కు ఎక్కువ మార్కెట్ ఉండడంతో ఆ ఒక్క ప్రాంతంలోనే ఎక్కువ స్క్రీన్లలో ఇది విడుదలైంది. ఫలితంగా ఈ సినిమాకు నైజాంలో మొదటి రోజు ఏకంగా రూ. 19.60 కోట్లు షేర్‌ను వసూలు చేసింది.
నైజాం గడ్డపైన బిగ్ షాక్
'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో మొదటి రోజే రూ. 19.60 కోట్లు షేర్ వచ్చింది. దీంతో ఈ గడ్డపై అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా ఇది నిలిచింది. తద్వారా RRR రికార్డును బద్దలు కొడుతుందని ప్రభాస్ అభిమానులు కన్న కల నెరవేరలేదు. ఇక, నైజాం టాప్ మూవీల్లో 'RRR' రూ. 23.35 కోట్లతో టాప్‌లో ఉండగా, 'సలార్' రూ. 22.55 కోట్లతో టాప్ 2లో ఉంది.


Click it and Unblock the Notifications











