Kalki 2898 AD Telugu Collections: కల్కి ఫైనల్ వసూళ్లు.. 2 చోట్ల హిట్ 6 చోట్ల ఫ్లాప్.. అసలు లెక్కలు ఇవే!

తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డమ్, మార్కెట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌లోనూ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. ఇటీవలే అతడు నటించిన సినిమానే 'కల్కి 2898 ఏడీ'. టెక్నికల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రం సెన్సేషనల్ రెస్పాన్స్‌తో భారీ వసూళ్లను అందుకుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో నష్టాలతో రన్‌ను ముగించింది. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' తెలుగు వెర్షన్ వసూళ్లపై పూర్తి వివరాలను మీరే చూడండి మరి!

కల్కిగా ప్రభాస్ అరాచకం
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రల్లో నటించారు.

Prabhas Starrer Kalki 2898 AD Movie Telugu Version Worldwide Box Office Collections

కల్కికి తెలుగులో బిజినెస్
'కల్కి 2898 ఏడీ' సినిమాకు నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 21 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 14 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 10 కోట్లు, గుంటూరులో రూ. 12 కోట్లు, కృష్ణాలో రూ. 12 కోట్లు, నెల్లూరులో రూ. 7 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 50 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 248 కోట్లు మేర వ్యాపారం జరిగింది.

అలాంటి టాక్‌తో నిరాశగా
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఇది ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అందుకు తగ్గట్లుగానే దీనికి పాజిటివ్ టాక్ లభించింది. ఫలితంగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో ఇది నిరాశనే ఎదుర్కొంది.

Prabhas Starrer Kalki 2898 AD Movie Telugu Version Worldwide Box Office Collections

కల్కికి తెలుగు కలెక్షన్లు
'కల్కి 2898 ఏడీ' ఫుల్ రన్‌లో తెలుగులో భారీ వసూళ్లు రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 92.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 21.80 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 21.73 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.46 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9.65 కోట్లు, గుంటూరులో రూ. 11.32 కోట్లు, కృష్ణాలో రూ. 11.32 కోట్లు, నెల్లూరులో రూ. 6.19 కోట్లతో.. రూ. 187.27 కోట్లు షేర్, రూ. 296.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఇలా
'కల్కి 2898 ఏడీ' మూవీ తెలుగు వెర్షన్‌కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగానూ అదిరిపోయే స్పందన లభించిందని చెప్పాలి. దీనికి ఫుల్ రన్‌లో తెలుగులో రూ. 187.27 కోట్లు వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 31.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 83.85 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 302.52 కోట్లు షేర్, రూ. 530 కోట్లు గ్రాస్ వచ్చింది.

Prabhas Starrer Kalki 2898 AD Movie Telugu Version Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. లాభమలా
'కల్కి 2898 ఏడీ' మూవీ తెలుగు వెర్షన్‌కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 248 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 250 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది దీనికి రూ. 302.52 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 52.52 కోట్లు లాభాలు దక్కాయి.

అక్కడ మాత్రం ఫ్లాప్‌గానే
ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకూ నిరాశే ఎదురైంది. ముఖ్యంగా ఈ సినిమా నైజాం, ఉత్తరాంధ్రలో మాత్రమే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకుంది. కానీ, సీడెడ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఏరియాల్లో మాత్రం క్లీన్ హిట్ కాలేదు. అలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల హిట్ అవగా.. 6 చోట్ల ఫ్లాప్‌గా మిగిలింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X