Kalki Closing Collections: 372 కోట్లు రావాలి.. షాకింగ్‌గా కల్కి వసూళ్లు.. లాభం వచ్చినా ఇక్కడ ఫ్లాపే!
టాలీవుడ్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో అందుకే చాలా మంది హీరోలు దేశ వ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. వీళ్లందరికీ ఆ మార్గాన్ని చూపించింది మాత్రం రెబెల్ స్టార్ ప్రభాసే. 'బాహుబలి' నుంచి వరుసగా భారీ చిత్రాలనే చేస్తోన్న అతడు పాన్ ఇండియా స్టార్‌గా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే అతడు 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లతో సత్తా చాటుకుంది. మరి ప్రభాస్ మూవీ క్లోజింగ్ కలెక్షన్ల లెక్కలను మీరే చూసేయండి మరి!
కల్కిగా ప్రభాస్ మారాడుగా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలను పోషించారు.

కల్కి సినిమా బిగ్ బిజినెస్
ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ'కి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది.
అలాంటి టాక్‌తో భారీగానే
యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపకల్పనలో ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇది ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే దీనికి పాజిటివ్ టాక్ దక్కింది. ఫలితంగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ బాగా లభించింది. దీంతో ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకుంది.

కల్కికి తెలుగు కలెక్షన్లు
'కల్కి 2898 ఏడీ' ఫుల్ రన్‌లో తెలుగులో భారీ వసూళ్లు రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 92.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 21.80 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 21.73 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.46 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9.65 కోట్లు, గుంటూరులో రూ. 11.32 కోట్లు, కృష్ణాలో రూ. 11.32 కోట్లు, నెల్లూరులో రూ. 6.19 కోట్లతో.. రూ. 187.27 కోట్లు షేర్, రూ. 296.15 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇలా
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీనికి ఫుల్ రన్‌లో తెలుగులో రూ. 187.27 కోట్లు, తమిళంలో రూ. 21.91 కోట్లు, కర్నాటకలో రూ. 36.51 కోట్లు, కేరళలో రూ. 13.01 కోట్లు, హిందీలో రూ. 149.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 130.70 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 539.25 కోట్లు షేర్, రూ. 1123 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభమలా
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 370 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 372 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది ఫుల్ రన్‌లో దీనికి రూ. 539.25 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 167.25 కోట్లు లాభాలతో రికార్డులు బద్దలు కొట్టేసింది.
లాభం వచ్చినా ఫ్లాప్‌గా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో లాభాలు వచ్చాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకూ నిరాశే ఎదురైంది. ముఖ్యంగా ఈ సినిమా నైజాం, ఉత్తరాంధ్రలో మాత్రమే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకుంది. కానీ, సీడెడ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఏరియాల్లో మాత్రం క్లీన్ హిట్ కాలేదు.


Click it and Unblock the Notifications











