Kalki 2898 AD Business: కల్కి బిజినెస్ అన్ని వందల కోట్లు.. ప్రభాస్ సరికొత్త చరిత్ర.. హిట్ కావాలంటే!
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. కొంత కాలంగా పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతూ దూసుకుపోతోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఈ మధ్య కాలంలో అతి భారీ చిత్రాలను చేస్తూ సత్తా చాటుతోన్నాడు. ఫలితంగా తన రేంజ్‌ను భారీగా పెంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇలా ఈ మధ్య కాలంలోనే ఎన్నో సినిమాలు చేసి అలరించాడు. ఈ ఊపులోనే ఇప్పుడు ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' అనే హై రేంజ్ మూవీతో రాబోతున్నాడు. ఈ చిత్రం ఓవరాల్‌గా ఎన్ని కోట్లు మేర బిజినెస్ చేసింది అనే వివరాలను చూడండి మరి!
కల్కిగా వచ్చేస్తున ప్రభాస్
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

టైం ట్రావెల్ స్టోరీతో రెడీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా టైం ట్రావెల్ కథతో రూపొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పలు యుగాల కాలలకు వెళ్లిన డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇందులో హీరో ప్రభాస్ సూపర్ పవర్స్ ఉన్న యువకుడిగా కనిపించబోతున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
గ్రాండ్ రిలీజ్.. ప్రమోషన్
విజువల్ వండర్‌గా రాబోతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీని జూన్ 27న ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు. అయినప్పటికీ ఓవర్సీస్‌తో పాటు ఇండియాలోని ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అన్ని ఏరియాల్లోనూ దీనికి అదిరిపోయే స్పందన వస్తోంది.

అంతటా భారీ డిమాండ్
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.
ఏపీ, తెలంగాణ బిజినెస్
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 70 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలను కలిపి రూ. 83 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రభాస్ మూవీకి రూ. 180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఇలా
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమా కర్నాటకలో రూ. 28 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ. 385 కోట్లు వ్యాపారం జరిగింది.
అన్ని కోట్ల టార్గెట్.. రికార్డు
'కల్కి 2898 ఏడీ' సినిమాకు రూ. 385 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 388 కోట్లు షేర్ వసూలు అయితేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రాల జాబితాలో ఇది రెండో స్థానానికి చేరింది. అదే సమయంలో ప్రభాస్ కెరీర్‌లోనే టాప్ మూవీగానూ ఈ సినిమా చరిత్రను సృష్టించింది.


Click it and Unblock the Notifications











