Kalki 2898 AD: ఆ విషయంలో ప్రభాస్‌కు నిరాశ.. బాహుబలి, RRR రికార్డులు సేఫ్

టాలీవుడ్‌ నుంచి వచ్చే ప్రతి భారీ బడ్జెట్ చిత్రానికి అదిరిపోయే హైప్ క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలు మాత్రం దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలు ఓ రేంజ్‌లో హైలైట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. అదే.. 'కల్కి 2898 ఏడీ'. టైం ట్రావెల్ కథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమా థియేటర్ల కౌంట్‌ను ఒకసారి మీరే చూసేయండి మరి!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం టైం ట్రావెల్ కథతో పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతుంది. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే పాజిటివ్ బజ్‌ను ఏర్పరచుకుంది. దీనికితోడు ఇప్పటికే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు అన్నీ ఆకట్టుకున్నాయి. దీంతో ఇది జూన్ 27న ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.

Prabhas Starrer Kalki 2898 AD Movie Worldwide Theaters Count

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. నేటి రాత్రి నుంచి ఓవర్సీస్‌లో ఈ సినిమా ప్రీమియర్ షోలు భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. అలాగే, గురువారం తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో కూడా షోలు అత్యధికంగా ప్రదర్శితం కాబోతున్నాయి.

'కల్కి 2898 ఏడీ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉండడంతో దీనికి ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ రూ. 370 కోట్లు వరకూ జరిగింది. దీనికి తగ్గట్లే ఈ సినిమా నైజాంలో 400, సీడెడ్‌ ప్లస్ ఆంధ్రాలో 850 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 1250 థియేటర్ల వరకూ విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 2000, ఓవర్సీస్‌లో 4500 థియేటర్లలో రాబోతుంది. తమిళనాడు, కేరళ, కర్నాటకలో కలిపి 750 అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 8500 థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

Prabhas Starrer Kalki 2898 AD Movie Worldwide Theaters Count

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా 8500కి పైగా థియేటర్లలో విడుదల కాబోతుంది. దీంతో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు హీరోల చిత్రాల లిస్టులో ఇది 3వ స్థానానికి చేరింది. ఇందులో RRR 10200 థియేటర్లలో టాప్‌లో ఉంది. అలాగే, టాప్ 5లో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు ఉండడం విశేషం.

ఇదిలా ఉండగా.. ప్రభాస్ హీరోగా క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X