Salaar 10 Days Collections: సండే పెను విధ్వంసం.. అక్కడ కూడా ఊచకోత.. ఏంటి అప్పుడే అన్ని వందల కోట్లా!
మామూలు తెలుగు హీరోగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించి.. కొంత కాలంగా పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా వరుసగా భారీ చిత్రాలను చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవలే ఈ బడా హీరో 'సలార్: సీజ్‌ఫైర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మాత్రం ఆరంభం నుంచీ భారీ రెస్పాన్స్ దక్కుతూనే ఉంది. ఫలితంగా ఈ మూవీ అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి 10 రోజుల్లో ఎంత వచ్చాయో మీరే లుక్కేయండి మరి!

సలార్‌గా అడుగెట్టిన ప్రభాస్: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రమే 'సలార్: సీజ్‌ఫైర్'. ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు.

సలార్ బిజినెస్ ఎంతంటే: ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 144 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ జరిగింది.

10వ రోజు భారీ వసూళ్లతో: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి సండే అయిన పదో రోజు భారీ స్పందనే లభించింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.80 కోట్లు షేర్ వసూలు అయింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 11.50 కోట్లు వచ్చాయి. ఇలా ఈ చిత్రం 10 రోజుల్లో భారీ వసూళ్లు సాధించింది. దీనిపై పూర్తి సమాచారం కాసేపట్లో....


Click it and Unblock the Notifications











