Salaar 11 Days Collections:న్యూ ఇయర్ వేళ సంచలన వసూళ్లు... ప్రభాస్‌ హిట్ కొట్టలాంటే?

రెబల్ స్టార్ ప్రభాస్.. కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక బహుబలి సిరీస్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇక బహుబలి తర్వాత ఆ స్థాయి సినిమాలే చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.

Recommended Video

రాజంటే రెబెలే రా Salaar Boxoffice 600 Cr.. దరిదాపుల్లో కూడా లేని King Khan | Telugu Filmibeat

ఇక బహుబలి తర్వాత సాహో, రాదేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు చేసినా.. ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఇటీవల సలార్ సీజ్ ఫైర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఆ సినిమాకు 11 రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయో తెలుసుకుందాం.

Prabhas Starrer Salaar Movie 11 Days Worldwide Box Office Collections

సలార్‌గా అడుగెట్టిన ప్రభాస్: రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా.. కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందించిన చిత్రం 'సలార్: సీజ్‌ఫైర్'. ఇక ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా నటించారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చాడు.

Prabhas Starrer Salaar Movie 11 Days Worldwide Box Office Collections

సలార్ బిజినెస్ ఎంతంటే: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి భారీగానే బిజినెస్ నమోదు చేసుకుంది. ఇక తెలంగాణ నైజాంలో రూ. 60 కోట్లు నమోదు చేసుకోగా, సీడెడ్‌లో రూ. 24 కోట్ల బిజినెస్ చేసుకుంది. ఇక ఏపీలో రూ. 60 కోట్లతో కలిపి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 144 కోట్లు బిజినెస్ నమోదు చేసుకుంది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకోగా.. తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 345 కోట్లు బిజినెస్ జరుపుకుంది.

సలార్ డే వైజ్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూసుకుంటే.. మొదటి రోజు రూ. 50.29 కోట్లు, రెండో రోజు రూ. 21.23 కోట్లు, 3వ రోజు రూ. 22.40 కోట్లు, 4వ రోజు రూ. 18.05 కోట్లు, 5వ రోజు రూ. 10.00 కోట్లు, 6వ రోజు రూ. 4.35 కోట్లు, 7వ రోజు రూ. 2.22 కోట్లు, 8వ రోజు రూ. 1.71 కోట్లు, 9వ రోజు రూ. 2.60 కోట్లు, 10వ రోజు రూ. 2.77 కోట్లు, 11వ రోజు రూ. 8.28 కోట్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 11 రోజుల్లో రూ. 145.09 కోట్లు షేర్ ( రూ. 223.80 కోట్లు~ గ్రాస్) వసూలు చేసింది.

సలార్ డే 11వ రోజు కలెక్షన్స్ చూస్తే నైజాం రూ.4.15 కోట్లు, సీడెడ్ రూ.1.68కోట్లు, ఉత్తరాంధ్ర రూ.96 లక్షలు, తూర్పు రూ.53 లక్షలు, పశ్చిమ రూ.26 లక్షలు, గుంటూరు రూ.23 లక్షలు, కృష్ణ రూ.28 లక్షలు, నెల్లూరు రూ.19 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు రూ.8.28కోట్లు ( రూ.14.30కోట్లు గ్రాస్) వసూలు చేసింది.

సలార్ 11 రోజుల మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ చూస్తే... నైజాం రూ. 69.40 కోట్లు, సీడెడ్ రూ.21.55కోట్లు, ఉత్తరాంధ్ర రూ.15.88 కోట్లు, తూర్పు రూ.10.32 కోట్లు, పశ్చిమ రూ.6.86 కోట్లు, గుంటూరు రూ.9.14 కోట్లు, కృష్ణ రూ.7.31 కోట్లు, నెల్లూరు రూ.4.63 కోట్లు రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ. 145.09 కోట్లు షేర్ ( రూ. 223.80 కోట్లు~ గ్రాస్) వసూలు చేసింది. కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ.21.45 కోట్లు, తమిళనాడు రూ.10.90 కోట్లు, కేరళ రూ.6.55 కోట్లు, హిందీరెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.66.40 కోట్లు, ఓవర్సీస్ లో రూ.61.85 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే.. రూ.312.24 కోట్లు షేర్ (గ్రాస్-రూ. 578.40కోట్లు) రాబట్టింది.

సినిమా మొత్తం వ్యాపారం రూ.345 కోట్లు చేసుకోగా.. బ్రేక్ ఈవెన్ రూ.347 కోట్లుగా నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అనగా హిట్ స్టేటస్ సొంతం చేసుకోవాలంటే... మరో 34.76 కోట్లు కావాలి. మరి ఈ వీకెండ్ లోపు పూర్తి చేసుకుంటే బెటర్. నెక్ట్స్ వీక్ సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X