Salaar 12 Days Collections: సలార్‌కు తగ్గిన కలెక్షన్లు... హిట్ కొట్టాలంటే ఇంకా ఎంత రావాలంటే?
బహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కు ఆ రేంజ్ హిట్ పడలేదు. పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ అయితే వచ్చింది కానీ.. ఇక ఆ తర్వాత చేసిన సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన చిత్రం సలార్ సీజ్ ఫైర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. రిలీజ్ 12 రోజులు అవుతున్న కలెక్షన్స్ మాత్రం వస్తునే ఉన్నాయి. ఇక ఈ క్రమంలో ఈ సినిమాకు 12 రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయో తెలుసుకుందాం.
సలార్‌గా అడుగెట్టిన ప్రభాస్: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన చిత్రం సలార్ సీజ్ ఫైర్. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది. ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ భారీ బడ్జెట్ తో రూపొందించారు. జగపతి బాబు, శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు.

సలార్ బిజినెస్ ఎంతంటే: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే భారీ బిజినెస్ నమోదు చేసుకుంది. నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఏపీలో రూ. 60 కోట్లతో కలిపి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 144 కోట్లు బిజినెస్ జరుపుకుంది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 345 కోట్లు బిజినెస్ నమోదు చేసుకుంది.

12వ రోజు భారీ వసూళ్లతో: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి కొత్త సంవత్సరం 2024 రెండో రోజు అయిన 12వ రోజు భారీ స్పందనే లభించింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.50 కోట్లు షేర్ వసూలు అయింది. ఇక హిందీలో ఈ సినిమా రూ.4.5 కోట్లు వసూలు చేయగా.. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 7 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 632 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఇలా ఈ చిత్రం 12 రోజుల్లో భారీ వసూళ్లు సాధించింది.

సలార్ ఇంకా ఎన్ని కోట్లు రాబట్టాలంటే: అంటే ఈ చిత్రం హిట్ టాక్ రావాలంటే... బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.347 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, సుమారు రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే.. ఈ చిత్రం సుమారు రూ.34 కోట్ల షేర్ ని అంటే రూ.68 కోట్ల గ్రాస్ ని అందుకోవాల్సి ఉంది. మరి ఈ వీక్ తో సలార్ ఆ కలెక్షన్స్ ని అందుకొని బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











