Salaar 13 Days Collections: రూ.600 కోట్ల క్లబ్‌లో ప్రభాస్ సలార్... లియో, జైలర్ రికార్డులు బ్రేక్?

ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ నటించిన సలార్‌ థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ మువీ బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్‌ వసూలు చేస్తుంది. 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.700 కోట్ల మార్క్ దిశగా కలెక్షన్స్ రాబడుతోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సౌత్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా మొదటి వారాంతం తర్వాత కలెక్షన్స్‌ పరంగా కాస్త డల్ అయింది అయితే న్యూ ఇయర్ సందర్భంగా మళ్లీ కాస్త పుంజుకోగా.. 13 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ ఓ సారి చూద్దాం.

Prabhas Starrer Salaar Movie 13 Days Worldwide Box Office Collections

రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా.. ప్రశాంత్ నీల్ రూపొందించిన మాస్ యాక్షన్ ఫిలిం 'సలార్: సీజ్‌ఫైర్'. ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా నటించారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు కీలకపాత్రలు పోషించారు. రవి బస్రూర్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందించారు.

Prabhas Starrer Salaar Movie 13 Days Worldwide Box Office Collections

సలార్ బిజినెస్ ఎంతంటే: ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి నైజాంలో రూ. 60.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 24.12 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60.01 కోట్లతో కలిపి తెలుగులో రూ. 144.03 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30.41 కోట్లు, తమిళనాడులో రూ. 12.02 కోట్లు, హిందీలో రూ. 75.1 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3.11 కోట్లు, కేరళలో రూ. 6.09 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75.12 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ జరిగింది.

Prabhas Starrer Salaar Movie 13 Days Worldwide Box Office Collections

13వ రోజు భారీ వసూళ్లతో: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి సండే అయిన 13 రోజు భారీ స్పందనే లభించింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 2 కోట్లు షేర్ వసూలు అయింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 7.50 కోట్లు వచ్చాయి. ఇలా ఈ చిత్రం 13 రోజుల్లో భారీ వసూళ్లు సాధించింది.

Prabhas Starrer Salaar Movie 13 Days Worldwide Box Office Collections

ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు రాబట్టిందంటే: సలార్ సినిమా రిలీజ్ అయి 13 రోజులు అవుతున్న మంచి వసూళ్లే వస్తున్నాయి. ఇక ఈ సినిమా 13 రోజుల్లో రూ.325 కోట్ల షేర్ వసూలు చేయగా... దాదాపుగా రూ. 596 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల రేంజ్ లో టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే హిట్ స్టేటస్ రాబట్టవచ్చు. అయితే మరో రోజులో ప్రభాస్.. లియో, జైలర్ రికార్డులను బ్రేక్ చేయనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X