Salaar 15 Days Collections: ప్రభాస్‌కు బిగ్ షాక్.. తొలిసారి ఇంత తక్కువగా.. అన్ని కోట్లు వస్తేనే హిట్
పేరుకు తెలుగు హీరోనే అయినా ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ముఖ్యంగా ఇండియా వ్యాప్తంగా అతడు ప్రభావాన్ని చూపించేలా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. అయితే, ఈ మధ్య ఈ స్టార్‌కు హిట్లు మాత్రం రావడం లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలన్న పట్టుదలతో 'సలార్: సీజ్‌ఫైర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి మాత్రం ఆరంభంలో భారీ రెస్పాన్స్ వచ్చినా క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి 15 రోజుల్లో ఎంత వచ్చాయో మీరే చూడండి!
సలార్‌గా ప్రభాస్ ఊచకోత:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రమే 'సలార్: సీజ్‌ఫైర్'. ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. రవి బస్రూర్ మ్యూజిక్‌ను ఇచ్చాడు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు.

సలార్ బిజినెస్ ఎంతంటే:ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 144 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ జరిగింది.
15వ రోజు తెలుగు కలెక్షన్లు
'సలార్: సీజ్‌ఫైర్' 15వ రోజు తెలుగులో స్పందన మరింతగా తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 33 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వసూలు అయింది.
15 రోజుల్లో తెలుగు కలెక్షన్లు
15 రోజుల్లో 'సలార్: సీజ్‌ఫైర్'కు తెలుగులో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 70.43 కోట్లు, సీడెడ్‌లో రూ. 22.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 16.43 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 10.47 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 6.95 కోట్లు, గుంటూరులో రూ. 9.20 కోట్లు, కృష్ణాలో రూ. 7.39 కోట్లు, నెల్లూరులో రూ. 4.69 కోట్లతో.. రూ. 147.75 కోట్లు షేర్, రూ. 228.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'సలార్: సీజ్‌ఫైర్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 15 రోజుల్లో తెలుగులో రూ. 157.43 కోట్లు, తమిళంలో రూ. 11.20 కోట్లు, కర్నాటకలో రూ. 22.02 కోట్లు, కేరళలో రూ. 6.74 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 71.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 63.60 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 323.21 కోట్లు షేర్, రూ. 600.55 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి
'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 15 రోజుల్లో దీనికి రూ. 323.21 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 23.79 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











