Salaar 16 Days Collections: శనివారం షాకింగ్ కలెక్షన్లు.. మొత్తంగా అన్ని కోట్లు.. మూవీ హిట్ కావాలంటే!

టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా ప్రభావాన్ని చూపి.. కొంత కాలంగా పాన్ ఇండియా మొత్తాన్ని తనవైపు చూసేలా చేస్తున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఈ మధ్య కాలంలో ఎన్నో భారీ సినిమాలను చేశాడు. అయితే, అవేమీ అతడికి విజయాన్ని ఇవ్వలేదు. దీంతో ఈ సారి గట్టిగా కొట్టాలన్న లక్ష్యంతో 'సలార్: సీజ్‌ఫైర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మాత్రం ఆరంభంలో భారీ స్పందన లభించినా.. క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి 16 రోజుల్లో ఎంత వచ్చాయో మీరే లుక్కేయండి!

సలార్‌గా ప్రభాస్ విశ్వరూపం:రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన మూవీనే 'సలార్: సీజ్‌ఫైర్'. ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.

Prabhas Starrer Salaar Movie 16 Days Worldwide Box Office Collections

సలార్ బిజినెస్ ఎంతంటే:ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 144 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ అయింది.

16వ రోజు తెలుగు కలెక్షన్లు:'సలార్: సీజ్‌ఫైర్' 16వ రోజు తెలుగులో స్పందన భారీగా పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 65 లక్షలు షేర్, రూ. 1.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Prabhas Starrer Salaar Movie 16 Days Worldwide Box Office Collections

16 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:'సలార్: సీజ్‌ఫైర్'కు 16 రోజుల్లో తెలుగులో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 70.69 కోట్లు, సీడెడ్‌లో రూ. 22.35 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 16.56 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 10.50 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 6.97 కోట్లు, గుంటూరులో రూ. 9.22 కోట్లు, కృష్ణాలో రూ. 7.41 కోట్లు, నెల్లూరులో రూ. 4.70 కోట్లతో.. రూ. 148.40 కోట్లు షేర్, రూ. 229.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Prabhas Starrer Salaar Movie 16 Days Worldwide Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:'సలార్: సీజ్‌ఫైర్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 16 రోజుల్లో తెలుగులో రూ. 148.40 కోట్లు, తమిళంలో రూ. 11.25 కోట్లు, కర్నాటకలో రూ. 22.25 కోట్లు, కేరళలో రూ. 6.78 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 73.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 63.95 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 326.28 కోట్లు షేర్, రూ. 607.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

Prabhas Starrer Salaar Movie 16 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 16 రోజుల్లో దీనికి రూ. 326.28 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 20.72 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X