Salaar 17 Days Collections: సండే కుమ్మేసిన సలార్.. ఏకంగా అన్ని కోట్లతో ఊచకోత.. కానీ హిట్ కావాలంటే!
ఈ మధ్య కాలంలో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ.. దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటూ వెళ్తోన్న హీరోనే రెబెల్ స్టార్ ప్రభాస్. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. కచ్చితంగా హిట్ కొట్టాలన్న లక్ష్యంతోనే 'సలార్: సీజ్‌ఫైర్' అనే సినిమాను చేశాడు. దీనికి మాత్రం ఆరంభంలో భారీ స్పందన లభించింది. కానీ, ఆ తర్వాత నుంచి రెస్పాన్స్ క్రమంగా తగ్గుతోంది. అయితే, ఈ వీకెండ్‌లో ఈ చిత్రం మళ్లీ పుంజుకుంది. ఈ నేపథ్యంలో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి 17 రోజుల్లో ఎంత వచ్చాయో మీరే చూసేయండి!
సలార్‌గా ప్రభాస్ ఊరమాస్ : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రమే 'సలార్: సీజ్‌ఫైర్'. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ సంగీతం ఇచ్చాడు.

సలార్ బిజినెస్ ఎంతంటే : ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్'కు నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 144 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ జరిగింది.

17వ రోజు కుమ్మేసిందిగా : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి 17వ రోజు అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 90 లక్షలు వరకూ షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.80 కోట్లు రాబట్టి సత్తా చాటింది. దీనిపై పూర్తి సమాచారం కాసేపట్లో అప్‌డేట్ చేస్తాము.


Click it and Unblock the Notifications











