Salaar 19 Days Collections: సలార్ ఖేల్ ఖతం.. మరీ దారుణంగా వసూళ్లు.. ఇంకెన్ని కోట్లు వస్తే హిట్ అంటే!
తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చినా.. దేశ వ్యాప్తంగా ఎఫెక్టును చూపిస్తున్న హీరోనే రెబెల్ స్టార్ ప్రభాస్. అలా చాలా కాలంగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తోన్న అతడు.. పెద్దగా విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు.
దీంతో ఈ సారి సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ చేశాడు. దీనికి మాత్రం ఆరంభంలో భారీ స్పందన లభించింది. కానీ, ఆ తర్వాత నుంచి రెస్పాన్స్ క్రమంగా తగ్గుతోంది. వీకెండ్ పెరిగినా ఇప్పుడు దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి 19 రోజుల రిపోర్టును మీరే చూడండి!

సలార్‌గా ప్రభాస్ వచ్చాడు: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రమే 'సలార్: సీజ్‌ఫైర్'. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు.

సలార్ బిజినెస్ ఎంతంటే: ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 144 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ అయింది.

19వ రోజు తెలుగు కలెక్షన్లు: కేజీఎఫ్‌తో తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ క్రమంగా పడిపోతూనే ఉంది. మూడో వారంలో ఈ చిత్రం మరింత డౌన్ అవుతోంది. ఈ క్రమంలోనే 19వ రోజైన మంగళవారం 'సలార్' మూవీ ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 14 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసింది.

19 రోజుల్లో తెలుగు కలెక్షన్లు: 'సలార్: సీజ్‌ఫైర్'కు 19 రోజుల్లో తెలుగులో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 71.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 22.58 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 16.78 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 10.56 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.01 కోట్లు, గుంటూరులో రూ. 9.27 కోట్లు, కృష్ణాలో రూ. 7.45 కోట్లు, నెల్లూరులో రూ. 4.72 కోట్లతో.. రూ. 149.42 కోట్లు షేర్, రూ. 231.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: 'సలార్: సీజ్‌ఫైర్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 19 రోజుల్లో తెలుగులో రూ. 149.42 కోట్లు, తమిళంలో రూ. 11.45 కోట్లు, కర్నాటకలో రూ. 22.72 కోట్లు, కేరళలో రూ. 6.85 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 76.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 64.40 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 331.09 కోట్లు షేర్, రూ. 617.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి: 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 19 రోజుల్లో దీనికి రూ. 331.09 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 15.91 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











