Salaar 1st Week Collections: 347 కోట్లు రావాలి.. వారంలో ఊహించనన్ని కోట్లు.. హిట్ కావాలంటే మాత్రం!
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోగా హవాను చూపించి.. 'బాహుబలి' సక్సెస్ తర్వాత నుంచి పాన్ ఇండియాపై ప్రభావాన్ని చూపిస్తున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలతో వచ్చాడు. కానీ, ఇవన్నీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో వచ్చాడు. దీనికి ఆరంభం నుంచీ భారీ స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటుతోంది. మరి 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి 7 రోజుల్లో ఎంత వచ్చాయో మీరే లుక్కేయండి!
సలార్‌గా రచ్చ చేసిన స్టార్ : సూపర్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన భారీ మూవీనే 'సలార్: సీజ్‌ఫైర్'. ప్రశాంత్ నీల్ తీసిన దీన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు.

సలార్ బిజినెస్ ఎంతంటే : ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్'కు నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 120 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ అయింది.
7వ రోజు తెలుగు కలెక్షన్లు : సలార్: సీజ్‌ఫైర్' ఏడో రోజు తెలుగులో మరింత పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 1.13 కోట్లు, సీడెడ్‌లో రూ. 29 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 11 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో.. రూ. 2.22 కోట్లు షేర్, రూ. 3.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
7 రోజుల్లో తెలుగు కలెక్షన్లు : 7 రోజుల్లో 'సలార్: సీజ్‌ఫైర్' తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 62.71 కోట్లు, సీడెడ్‌లో రూ. 17.41 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 13.55 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.30 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 6.13 కోట్లు, గుంటూరులో రూ. 8.59 కోట్లు, కృష్ణాలో రూ. 6.63 కోట్లు, నెల్లూరులో రూ. 4.22 కోట్లతో.. రూ. 128.54 కోట్లు షేర్, రూ. 196.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత : 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రచ్చ లేపుతోంది. దీనికి 7 రోజుల్లో తెలుగులో రూ. 128.54 కోట్లు, తమిళంలో రూ. 9.65 కోట్లు, కర్నాటకలో రూ. 19.35 కోట్లు, కేరళలో రూ. 5.80 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 51.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 52.80 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 267.24 కోట్లు షేర్, రూ. 520 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి : 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 7 రోజుల్లో దీనికి రూ. 267.24 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 79.76 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.
అక్కడ వంద కోట్లకు చేరువ : కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 520 కోట్లు వరకూ గ్రాస్ వసూలు చేసింది. ఇక, ఈ చిత్రం హిందీలో రూ. 100 కోట్లు నెట్‌కు చేరువగా వచ్చేసింది. మొత్తంగా మరో 80 కోట్లు వరకూ వసూలు చేస్తేనే ఇది హిట్ అవుతుంది కాబట్టి ఈ వీకెండ్ రాణించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











