Salaar 2 Days Collections: సలార్‌కు మాస్ వసూళ్లు.. 2 రోజుల్లో అన్ని కోట్లా.. రికార్డులు చెల్లాచెదురు
తెలుగు చిత్ర పరిశ్రమకు తన స్టామినాను ఎప్పుడో చూపించి.. 'బాహుబలి' సిరీస్ తర్వాత నుంచి పాన్ ఇండియాపైనా పాగా వేసే సినిమాలు చేస్తోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ మధ్య కాలంలో సరైన ఫలితాలు రాబట్టలేకపోతోన్న అతడు.. ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ చేశాడు. ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీ శుక్రవారమే విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. మరి 'సలార్: సీజ్‌ఫైర్' రెండు రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!
సలార్‌గా ప్రభాస్ అరాచకం
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'సలార్: సీజ్‌ఫైర్'. ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు.

సలార్ బిజినెస్ ఎంతంటే
'సలార్: సీజ్‌ఫైర్' సినిమాకు నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 120 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ జరిగింది.
2వ రోజు తెలుగు కలెక్షన్లు
'సలార్: సీజ్‌ఫైర్' రెండో రోజూ తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 11.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.32 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 77 లక్షలు, గుంటూరులో రూ. 1.10 కోట్లు, కృష్ణాలో రూ. 1.11 కోట్లు, నెల్లూరులో రూ. 68 లక్షలతో.. రూ. 21.23 కోట్లు షేర్, రూ. 33.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
2 రోజుల్లో తెలుగు కలెక్షన్లు
2 రోజుల్లో 'సలార్: సీజ్‌ఫైర్' తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 33.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.90 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.87 కోట్లు, గుంటూరులో రూ. 5.60 కోట్లు, కృష్ణాలో రూ. 3.53 కోట్లు, నెల్లూరులో రూ. 2.53 కోట్లతో.. రూ. 71.52 కోట్లు షేర్, రూ. 104.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 2 రోజుల్లో తెలుగులో రూ. 71.52 కోట్లు, తమిళంలో రూ. 4.45 కోట్లు, కర్నాటకలో రూ. 9.65 కోట్లు, కేరళలో రూ. 3.20 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 19.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35.20 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 143.27 కోట్లు షేర్, రూ. 251.15 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి
'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 2 రోజుల్లో దీనికి రూ. 143.27 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 203.73 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.
రికార్డులు చెల్లాచెదురుగా
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి రెండు రోజుల్లోనే రూ. 251 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఫలితంగా ఏకంగా 5 సార్లు ఈ మార్కును దాటిన తెలుగు హీరోగా అతడు రికార్డు సాధించాడు. అదే సమయంలో రెండో రోజు RRR తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ సాధించిన సినిమాగానూ సలార్ రికార్డును నమోదు చేసుకుంది.


Click it and Unblock the Notifications











