Salaar 2 Weeks Collections: 347 కోట్లు వస్తే హిట్.. 2 వారాల్లో అన్ని కోట్లు.. నైజాంలో ప్రభాస్ సెంచరీ
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన రీతిలో సినిమాలు చేసి.. చాలా ఏళ్ల పాటు డార్లింగ్‌గా ప్రేక్షకులను, అభిమానులను అలరించాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్న అతడు.. హిట్లు మాత్రం అందుకోలేదు.
ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మాత్రం ఆరంభంలో భారీ రెస్పాన్స్ వచ్చినా క్రమంగా డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి 14 రోజుల్లో ఎంత వచ్చాయో మీరే లుక్కేయండి!

సలార్‌గా ఎంటరైన ప్రభాస్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ తీసిన చిత్రమే 'సలార్: సీజ్‌ఫైర్'. ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.

సలార్ బిజినెస్ ఎంతంటే: ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' చిత్రానికి నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 144 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ అయింది.

14వ రోజు తెలుగు కలెక్షన్లు: 'సలార్: సీజ్‌ఫైర్' 14వ రోజు తెలుగులో రెస్పాన్స్ డౌన్ అయిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 48 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్ వసూలు అయింది.
14 రోజుల్లో తెలుగు కలెక్షన్లు: 'సలార్: సీజ్‌ఫైర్'కు 14 రోజుల్లో తెలుగులో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 70.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 22.11 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 16.35 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 10.46 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 6.94 కోట్లు, గుంటూరులో రూ. 9.19 కోట్లు, కృష్ణాలో రూ. 7.38 కోట్లు, నెల్లూరులో రూ. 4.68 కోట్లతో.. రూ. 147.42 కోట్లు షేర్, రూ. 227.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ రాణిస్తోంది. దీనికి 14 రోజుల్లో తెలుగులో రూ. 147.42 కోట్లు, తమిళంలో రూ. 11.15 కోట్లు, కర్నాటకలో రూ. 21.90 కోట్లు, కేరళలో రూ. 6.70 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 63.45 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 321.42 కోట్లు షేర్, రూ. 596.95 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి: 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 14 రోజుల్లో దీనికి రూ. 321.42 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 25.58 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

అక్కడ 100 కోట్లతో రికార్డు: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. మరీ ముఖ్యంగా నైజాం గడ్డపై ఈ చిత్రం దుమ్ము దులుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ సినిమా అక్కడ రూ. 100 కోట్లు గ్రాస్ మార్కును దాటింది. తద్వారా RRR తర్వాత ఈ ఘనత సాధించిన సినిమాగా నిలిచి రికార్డును నమోదు చేసుకుంది.


Click it and Unblock the Notifications











