Salaar 20 Days Collections: సలార్ పని ఔట్.. కష్టాల్లో ప్రభాస్ మూవీ.. ఇంకా అన్ని కోట్లు రావాల్సిందే!
టాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోలు పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోన్న విషయం తెలిసిందే. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మాత్రం రెబెల్ స్టార్ ప్రభాస్‌దే. అంతలా ఈ బడా హీరో తనదైన మార్క్ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' అనే మూవీని చేశాడు. దీనికి ఆరంభంలో భారీ స్పందన లభించింది. కానీ, ఆ తర్వాత నుంచి మాత్రం దీనికి రెస్పాన్స్ క్రమంగా పడిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి 20 రోజుల్లో ఎంత వసూలు అయ్యాయో చూడండి!
సలార్‌గా ప్రభాస్ విశ్వరూపం:రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీనే 'సలార్: సీజ్‌ఫైర్'. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు.

సలార్ బిజినెస్ ఎంతంటే:ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్'కు నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 144 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ జరిగింది.
20వ రోజు తెలుగు కలెక్షన్లు:చాలా కాలంగా సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి క్రమంగా రెస్పాన్స్ పడిపోతూనే ఉంటోంది. మూడో వారంలో అయితే ఈ చిత్రం మరింతగా పడిపోతూనే ఉంది. దీంతో 20వ రోజైన బుధవారం ప్రభాస్ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

20 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:20 రోజుల్లో 'సలార్: సీజ్‌ఫైర్'కు తెలుగులో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 71.09 కోట్లు, సీడెడ్‌లో రూ. 22.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 16.80 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 10.57 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.02 కోట్లు, గుంటూరులో రూ. 9.27 కోట్లు, కృష్ణాలో రూ. 7.45 కోట్లు, నెల్లూరులో రూ. 4.72 కోట్లతో.. రూ. 149.52 కోట్లు షేర్, రూ. 231.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:'సలార్: సీజ్‌ఫైర్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 20 రోజుల్లో తెలుగులో రూ. 149.52 కోట్లు, తమిళంలో రూ. 11.48 కోట్లు, కర్నాటకలో రూ. 22.80 కోట్లు, కేరళలో రూ. 6.88 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 76.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 64.45 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 331.63 కోట్లు షేర్, రూ. 618.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 20 రోజుల్లో దీనికి రూ. 331.63 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 15.37 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











