Salaar 3 Days Collections: ప్రభాస్ వీర కుమ్ముడు.. 3 రోజుల్లో వందల కోట్లు.. ఆ రికార్డులన్నీ బ్లాస్టే!
టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుతోన్న హీరోనే రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి' తర్వాత నుంచి తన రేంజ్‌ను పెంచుకుంటోన్న అతడు.. వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. వాటి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు 'సలార్: సీజ్‌ఫైర్' అనే మూవీతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో ఈ మూవీ శుక్రవారమే విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. మరి 'సలార్: సీజ్‌ఫైర్' 3 రోజుల రిపోర్టు మీరే చూడండి!
సలార్‌గా ప్రభాస్ విశ్వరూపం:రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీనే 'సలార్: సీజ్‌ఫైర్'. ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించాడు.

సలార్ బిజినెస్ ఎంతంటే:'సలార్: సీజ్‌ఫైర్' చిత్రానికి నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 120 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ అయింది.
3వ రోజు తెలుగు కలెక్షన్లు:'సలార్: సీజ్‌ఫైర్' మూడో రోజూ తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 10.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.73 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.41 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 85 లక్షలు, గుంటూరులో రూ. 1.20 కోట్లు, కృష్ణాలో రూ. 1.27 కోట్లు, నెల్లూరులో రూ. 77 లక్షలతో.. రూ. 22.40 కోట్లు షేర్, రూ. 35.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

3 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:3 రోజుల్లో 'సలార్: సీజ్‌ఫైర్' తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 44.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9.77 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 7.31 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.72 కోట్లు, గుంటూరులో రూ. 6.80 కోట్లు, కృష్ణాలో రూ. 4.80 కోట్లు, నెల్లూరులో రూ. 3.30 కోట్లతో.. రూ. 93.92 కోట్లు షేర్, రూ. 140.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రచ్చ లేపుతోంది. దీనికి 3 రోజుల్లో తెలుగులో రూ. 93.92 కోట్లు, తమిళంలో రూ. 5.80 కోట్లు, కర్నాటకలో రూ. 13.35 కోట్లు, కేరళలో రూ. 4.05 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 29.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 38.80 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 185.67 కోట్లు షేర్, రూ. 402 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 3 రోజుల్లో దీనికి రూ. 185.67 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 161.33 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.
ఆ రికార్డులన్నీ పేలాయిగా:రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి మూడు రోజుల్లోనే రూ. 300 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఫలితంగా ఏకంగా 5 సార్లు ఈ మార్కును దాటిన సౌతిండియన్ హీరోగా అతడు రికార్డు సాధించాడు. అదే సమయంలో మూడో రోజు RRR తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ సాధించిన సినిమాగానూ సలార్ రికార్డును సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











