Salaar 3 Weeks Collections: 347 కోట్లు రావాలి.. 3 వారాల్లో భారీగానే.. అదే జరిగితే ప్రభాస్‌కు ఫ్లాపే!

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ఏళ్ల పాటు స్టార్‌గా హవాను చూపించి.. బాహుబలి సిరీస్ తర్వాత నుంచి పాన్ ఇండియా స్టార్‌గా దేశ వ్యాప్తంగా దండయాత్ర చేస్తున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ మధ్య కాలంలో అతడు భారీ బడ్జెట్ చిత్రాలు చాలానే చేశాడు. కానీ, ఇవేమీ విజయాన్ని మాత్రం అందించలేదు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్ బాగున్నా రెస్పాన్స్ క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. దీంతో వసూళ్లు అంతగా రావట్లేదు. మరి ఈ సినిమా 3 వారాల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!

సలార్‌గా ప్రభాస్ వచ్చాడు : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీనే 'సలార్: సీజ్‌ఫైర్'. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు.

Prabhas Starrer Salaar Movie 3 Weeks Worldwide Box Office Collections

సలార్ బిజినెస్ ఎంతంటే : ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 144 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ అయింది.

21వ రోజు తెలుగు కలెక్షన్లు
ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి క్రమంగా రెస్పాన్స్ పడిపోతూనే ఉంటోంది. మూడో వారంలో అయితే ఈ చిత్రం మరింతగా డౌన్ అయిపోయింది. దీంతో 21వ రోజైన గురువారం ప్రభాస్ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 8 లక్షలు షేర్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

21 రోజుల్లో తెలుగు కలెక్షన్లు
'సలార్: సీజ్‌ఫైర్'కు 21 రోజుల్లో తెలుగులో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 71.12 కోట్లు, సీడెడ్‌లో రూ. 22.61 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 16.81 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 10.57 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.03 కోట్లు, గుంటూరులో రూ. 9.27 కోట్లు, కృష్ణాలో రూ. 7.45 కోట్లు, నెల్లూరులో రూ. 4.72 కోట్లతో.. రూ. 149.60 కోట్లు షేర్, రూ. 231.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'సలార్: సీజ్‌ఫైర్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 21 రోజుల్లో తెలుగులో రూ. 149.60 కోట్లు, తమిళంలో రూ. 11.50 కోట్లు, కర్నాటకలో రూ. 22.85 కోట్లు, కేరళలో రూ. 6.90 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 76.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 64.50 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 332.15 కోట్లు షేర్, రూ. 620.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

Prabhas Starrer Salaar Movie 3 Weeks Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి
'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 21 రోజుల్లో దీనికి రూ. 332.15 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 14.87 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

టార్గెట్‌ను చేరడం కష్టమే
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి మూడు వారాల్లో డీసెంట్ వసూళ్లే వచ్చాయి. కానీ, ఇది టార్గెట్‌ను చేరుకోవాలంటే ఇంకా రూ. 14 కోట్లు పైగానే షేర్‌ను రాబట్టాల్సి ఉంది. అయితే, ఇప్పుడు సంక్రాంతి సినిమాల పోటీ ఉండడంతో ఈ మూవీ రన్ దాదాపుగా ముగిసిపోయింది. ఫలితంగా ఈ చిత్రం టార్గెట్‌ను చేరుకోవడం కష్టం అనే చెప్పుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X