Salaar 4 Days Collections: క్రిస్మస్‌కు కుమ్మిన సలార్.. అన్ని కోట్లతో మరో సంచలనం.. RRR రికార్డు ఔట్
తెలుగు చిత్ర పరిశ్రమలో తమ స్థాయిని పెంచుకున్న హీరోలు చాలా మందే కొన్నారు. కానీ, కొందరు మాత్రమే టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రెబెల్ స్టార్ ప్రభాస్. అంతలా అతడు ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా లెవెల్‌లో దండయాత్ర చేస్తున్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు 'సలార్: సీజ్‌ఫైర్' అనే మూవీతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. మరి 'సలార్: సీజ్‌ఫైర్' 4 రోజుల రిపోర్టు మీరే చూడండి మరి!
సలార్‌గా ఎంటరైన ప్రభాస్:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన యాక్షన్ మూవీనే 'సలార్: సీజ్‌ఫైర్'. ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ సంగీతం ఇచ్చాడు.

సలార్ బిజినెస్ ఎంతంటే:'సలార్: సీజ్‌ఫైర్' సినిమాకు నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 120 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ జరిగింది.
4వ రోజు తెలుగు కలెక్షన్లు:'సలార్: సీజ్‌ఫైర్' నాలుగో రోజు తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 9.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.08 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.12 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 67 లక్షలు, గుంటూరులో రూ. 1.03 కోట్లు, కృష్ణాలో రూ. 1.11 కోట్లు, నెల్లూరులో రూ. 52 లక్షలతో.. రూ. 18.05 కోట్లు షేర్, రూ. 28.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

4 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:'సలార్: సీజ్‌ఫైర్' 4 రోజుల్లో తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 53.59 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 11.85 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.43 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.39 కోట్లు, గుంటూరులో రూ. 7.83 కోట్లు, కృష్ణాలో రూ. 5.91 కోట్లు, నెల్లూరులో రూ. 3.89 కోట్లతో.. రూ. 111.97 కోట్లు షేర్, రూ. 168.78 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రచ్చ లేపుతోంది. దీనికి 4 రోజుల్లో తెలుగులో రూ. 111.97 కోట్లు, తమిళంలో రూ. 7.55 కోట్లు, కర్నాటకలో రూ. 16.20 కోట్లు, కేరళలో రూ. 4.90 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 37.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 44.30 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 222.17 కోట్లు షేర్, రూ. 450 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 4 రోజుల్లో దీనికి రూ. 222.17 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 124.83 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.
RRR రికార్డును బ్రేక్ చేసి:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్లు షేర్ మార్కును చేరుకుని సెన్సేషన్ అయింది. అదే సమయంలో నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్‌ను రాబట్టిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే RRR రికార్డు రూ. 17.73 కోట్లను దాటేసి చరిత్రను సృష్టించింది.


Click it and Unblock the Notifications











