Salaar 5 Days Collections: ఒక్కసారిగా డౌన్.. అయినా అన్ని వందల కోట్లు.. రికార్డులతో ప్రభాస్ బంతాట

కొంత కాలంగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ పాన్ ఇండియా హీరోగా హవాను చూపిస్తున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఎన్నో సినిమాల్లో నటించినా అవి సరైన ఫలితాలను మాత్రం అందించట్లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలని 'సలార్: సీజ్‌ఫైర్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో వరల్డ్ వైడ్‌గా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రానికి వసూళ్లు భారీగానే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి 5 రోజుల్లో ఎంత వచ్చాయో మీరే చూడండి!

Recommended Video

బద్దలైన Corporate Scam..Salaar పై దాడిని ఎదుర్కొంటున్న Prabhas Army | Filmibeat Telugu

సలార్‌గా ప్రభాస్ సెన్సేషన్:రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ మూవీనే 'సలార్: సీజ్‌ఫైర్'. ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం ఇచ్చాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు.

Prabhas Starrer Salaar Movie 5 Days Worldwide Box Office Collections

సలార్ బిజినెస్ ఎంతంటే:'సలార్: సీజ్‌ఫైర్' చిత్రానికి నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 120 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ అయింది.

5వ రోజు తెలుగు కలెక్షన్లు:'సలార్: సీజ్‌ఫైర్' నాలుగో రోజు తెలుగులో మంచి వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 5.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.31 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.17 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 44 లక్షలు, కృష్ణాలో రూ. 42 లక్షలు, నెల్లూరులో రూ. 23 లక్షలతో.. రూ. 10.00 కోట్లు షేర్, రూ. 16.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Prabhas Starrer Salaar Movie 5 Days Worldwide Box Office Collections

5 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:5 రోజుల్లో 'సలార్: సీజ్‌ఫైర్' తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 59.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 13.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.94 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.75 కోట్లు, గుంటూరులో రూ. 8.27 కోట్లు, కృష్ణాలో రూ. 6.33 కోట్లు, నెల్లూరులో రూ. 4.05 కోట్లతో.. రూ. 121.97 కోట్లు షేర్, రూ. 185.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రచ్చ లేపుతోంది. దీనికి 5 రోజుల్లో తెలుగులో రూ. 121.97 కోట్లు, తమిళంలో రూ. 8.40 కోట్లు, కర్నాటకలో రూ. 17.45 కోట్లు, కేరళలో రూ. 5.35 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 41.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 46.50 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 240.97 కోట్లు షేర్, రూ. 480 కోట్లు గ్రాస్ వచ్చింది.

Prabhas Starrer Salaar Movie 5 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 5 రోజుల్లో దీనికి రూ. 240.97 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 106.03 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

టాలీవుడ్‌లో నాలుగో స్థానం:సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి ఐదు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 121.97 కోట్లు షేర్ మార్కును చేరుకుంది. తద్వారా టాలీవుడ్‌లో నాలుగో స్థానానికి చేరింది. ఈ క్రమంలోనే సరిలేరు నీకెవ్వరు కలెక్షన్లను దాటింది. వరల్డ్ వైడ్‌గా కూడా ఈ సినిమా భారీ వసూళ్లతో పలు రికార్డులను బ్రేక్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X