Salaar 6 Days Collections: మరో రికార్డు కొట్టిన సలార్.. 500 కోట్లతో సంచలనం.. అక్కడ టార్గెట్ ఫినీష్
'బాహుబలి' సిరీస్ తర్వాత తెలుగు సినిమా స్థాయిని పెంచడంతో పాటు తన స్టామినాను కూడా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలతో వచ్చాడు. కానీ, అవన్నీ నిరాశనే మిగిల్చాయి. దీంతో ఇప్పుడు ఎలాగైనా గట్టిగా కొట్టాలన్న పట్టుదలతో 'సలార్: సీజ్‌ఫైర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్ మంచిగా రావడంతో వసూళ్లు భారీగానే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి 6 రోజుల్లో ఎంత వచ్చాయో మీరే లుక్కేయండి!
సలార్‌గా ఎంటరైన ప్రభాస్:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ మూవీనే 'సలార్: సీజ్‌ఫైర్'. ప్రశాంత్ నీల్ తీసిన దీన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ సంగీతం ఇచ్చాడు.

సలార్ బిజినెస్ ఎంతంటే:ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' సినిమాకు నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 120 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ జరిగింది.
6వ రోజు తెలుగు కలెక్షన్లు:'సలార్: సీజ్‌ఫైర్' నాలుగో రోజు తెలుగులో డౌన్ అయిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 2.41 కోట్లు, సీడెడ్‌లో రూ. 66 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 39 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 18 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో.. రూ. 4.35 కోట్లు షేర్, రూ. 7.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
6 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:'సలార్: సీజ్‌ఫైర్' తెలుగులో 6 రోజుల్లో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 61.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 17.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 13.31 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.15 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 6.00 కోట్లు, గుంటూరులో రూ. 8.49 కోట్లు, కృష్ణాలో రూ. 6.52 కోట్లు, నెల్లూరులో రూ. 4.15 కోట్లతో.. రూ. 126.32 కోట్లు షేర్, రూ. 192.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రచ్చ లేపుతోంది. దీనికి 6 రోజుల్లో తెలుగులో రూ. 126.32 కోట్లు, తమిళంలో రూ. 9.05 కోట్లు, కర్నాటకలో రూ. 18.50 కోట్లు, కేరళలో రూ. 5.60 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 45.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 48.60 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 253.77 కోట్లు షేర్, రూ. 500 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 6 రోజుల్లో దీనికి రూ. 253.77 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 93.23 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

500 కోట్ల.. వాళ్లకు జాక్‌పాట్:సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు తాజాగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక, ఈ చిత్రం నైజాం ఏరియాలో రూ. 60 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఫినీష్ చేసింది. తద్వారా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు లాభాలను తెచ్చిపెడుతోంది.


Click it and Unblock the Notifications











