Salaar 8 Days Collections: మరో రికార్డు ఊదేసిన ప్రభాస్.. వందల కోట్ల ఊచకోత.. సౌత్‌లో ఒకే ఒక్క హీరోగా!
టాలీవుడ్‌లో ఎంతో మంది బడా హీరోలు వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. కానీ, అందులో ఒక్కరు మాత్రమే ప్రతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చేస్తున్నారు. ఆ హీరోనే రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ మధ్య కాలంలో అతి భారీ బడ్జెట్ చిత్రాలతో వస్తోన్న ఈ బడా హీరో.. ఇప్పుడు 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు.
దీనికి ఆరంభం నుంచీ భారీ స్పందన వస్తూనే ఉంది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి 8 రోజుల్లో ఎంత వచ్చాయో మీరే చూడండి మరి!

సలార్‌గా రెబెల్ స్టార్ ప్రభాస్: రెబెల్ స్టార్ హీరో ప్రభాస్.. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రమే 'సలార్: సీజ్‌ఫైర్'. ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ సంగీతాన్ని ఇచ్చాడు.

సలార్ బిజినెస్ ఎంతంటే: యాక్షన్ మూవీ 'సలార్: సీజ్‌ఫైర్'కు నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 120 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ జరిగింది.

8వ రోజు తెలుగు కలెక్షన్లు: 'సలార్: సీజ్‌ఫైర్' 8వ రోజు తెలుగులో రెస్పాన్స్ మరింత పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 78 లక్షలు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 20 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 11 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. రూ. 1.71 కోట్లు షేర్, రూ. 2.85 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
8 రోజుల్లో తెలుగు కలెక్షన్లు: 'సలార్: సీజ్‌ఫైర్'కు 8 రోజుల్లో తెలుగులో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 63.49 కోట్లు, సీడెడ్‌లో రూ. 17.64 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 13.75 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.44 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 6.24 కోట్లు, గుంటూరులో రూ. 8.67 కోట్లు, కృష్ణాలో రూ. 6.74 కోట్లు, నెల్లూరులో రూ. 4.28 కోట్లతో.. రూ. 130.25 కోట్లు షేర్, రూ. 199.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రచ్చ లేపుతోంది. దీనికి 8 రోజుల్లో తెలుగులో రూ. 130.25 కోట్లు, తమిళంలో రూ. 9.90 కోట్లు, కర్నాటకలో రూ. 19.80 కోట్లు, కేరళలో రూ. 6.00 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 53.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 54.65 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 274.55 కోట్లు షేర్, రూ. 535 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి: 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 8 రోజుల్లో దీనికి రూ. 274.55 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 72.45 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

అక్కడ వంద కోట్లకు చేరువ: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 535 కోట్లు వరకూ గ్రాస్ వసూలు చేసింది. తద్వారా మూడు సార్లు రూ. 500 కొట్టిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు. ఇక, ఈ చిత్రం హిందీలో రూ. 100 కోట్లు నెట్‌ను చేరినట్లు యూనిట్ తెలిపింది. దీంతో ప్రభాస్ 5 సార్లు ఈ ఫీట్ సాధించినట్లైంది.


Click it and Unblock the Notifications











