Salaar 9 Days Collections: ఒక్క తెలుగులోనే వందల కోట్లు.. ప్రభాస్ మరో సంచలనం.. మొత్తం అన్ని కోట్లా!
పేరుకు తెలుగు హీరోనే అయినా దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పరచుకుని సత్తా చాటుతోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. అందుకే ఇతగాడు వరుసగా భారీ చిత్రాలనే చేస్తూ అలరిస్తున్నాడు. ఇలా ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చేయగా.. అవన్నీ నిరాశ పరిచాయి.
Recommended Video

దీంతో ఇటీవలే 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మాత్రం ఆరంభం నుంచీ భారీ స్పందన లభిస్తూనే ఉంది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి 9 రోజుల్లో ఎంత వచ్చాయో మీరే లుక్కేయండి!

సలార్‌గా ప్రభాస్ సెన్సేషన్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రమే 'సలార్: సీజ్‌ఫైర్'. ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు.

సలార్ బిజినెస్ ఎంతంటే: ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్'కు నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 120 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు బిజినెస్ అయింది.

9వ రోజు తెలుగు కలెక్షన్లు: 'సలార్: సీజ్‌ఫైర్' 9వ రోజు తెలుగులో రెస్పాన్స్ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 98 లక్షలు, సీడెడ్‌లో రూ. 52 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 54 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో.. రూ. 2.60 కోట్లు షేర్, రూ. 4.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
9 రోజుల్లో తెలుగు కలెక్షన్లు: 9 రోజుల్లో 'సలార్: సీజ్‌ఫైర్'కు తెలుగులో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 64.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 18.16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 14.29 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.60 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 6.36 కోట్లు, గుంటూరులో రూ. 8.76 కోట్లు, కృష్ణాలో రూ. 6.86 కోట్లు, నెల్లూరులో రూ. 4.35 కోట్లతో.. రూ. 132.85 కోట్లు షేర్, రూ. 203.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 9 రోజుల్లో తెలుగులో రూ. 132.85 కోట్లు, తమిళంలో రూ. 10.20 కోట్లు, కర్నాటకలో రూ. 20.40 కోట్లు, కేరళలో రూ. 6.10 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 57.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 57.25 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 284.60 కోట్లు షేర్, రూ. 550 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి: 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 9 రోజుల్లో దీనికి రూ. 284.25 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 62.40 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

రెండు 200 కోట్లతో సెన్సేషన్: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా 9 రోజుల్లోనే ఈ సినిమా ఇక్కడ రూ. 200 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా రెండు సార్లు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫీట్ సాధించిన ఏకైక టాలీవుడ్ హీరోగా ప్రభాస్ రికార్డును క్రియేట్ చేశాడు.


Click it and Unblock the Notifications











