Salaar USA advance booking: సలార్ కలెక్షన్ల సంచలనం.. రిలీజ్ ముందే అన్ని కోట్లు ఏంటి సామీ!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమా స్థాయిలో భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఫలితంగా మన చిత్రాలకు నేషనల్ వైడ్‌గా భారీ స్థాయిలో హైప్ లభిస్తోంది. ఇలా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి.
అలాంటి వాటిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'సలార్' ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'సలార్' ఓ అరుదైన రికార్డు సాధించింది. ఆ వివరాలు మీకోసం!

సలార్‌గా మారిన ప్రభాస్: ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమానే 'సలార్'. ఈ మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇచ్చాడు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు సహా ఎంతో మంది నటిస్తున్నారు.

ఫస్ట్ పార్ట్.. రిలీజ్‌కు రెడీ: 'సలార్' మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. అందులో మొదటి పార్టును 'సలార్: సీజ్‌ఫైర్' టైటిల్‌తో డిసెంబర్ 22న తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు ట్రైలర్‌ను, పాటను కూడా విడుదల చేసింది. అలాగే, ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసేసింది. దీంతో ఈ మూవీ సందడి కనిపిస్తోంది.
బుకింగ్స్ ఎప్పుడో స్టార్ట్: ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కలిసి చేసిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ రిలీజ్ డిసెంబర్ 22వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. అలాగే, ఇండియాలో కూడా ఈ సినిమా టికెట్ల అమ్మకాలు ప్రారంభం అయ్యాయి.

మిలియన్ కొట్టేశాడుగా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. అక్కడ 430 లొకేషన్లలో 1376 షోలకు గానూ అమ్మకాలు ప్రారంభించగా.. ఇప్పటికే 38473 టికెట్లు కూడా అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇలా ఈ సినిమా అక్కడ అప్పుడే 1 మిలియన్ డాలర్లను కూడా వసూలు చేసి సత్తా చాటుకుంది.
ఆదిపురుష్ రికార్డ్ బ్రేక్: ప్రభాస్ సినిమాలకు యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ అదిరిపోయే రీతిలో సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ 'ఆదిపురుష్' మూవీకి ప్రీమియర్స్ ద్వారా 825K డాలర్లు వచ్చాయి. ఇప్పుడు ఈ రికార్డును 'సలార్: సీజ్‌ఫైర్' బ్రేక్ చేసేసింది. అంతేకాదు, విడుదలకు ఇంకా నాలుగు రోజులు సమయం ఉండగానే 1 మిలియన్ మార్క్ కూడా క్రాస్ చేసి సత్తా చాటుకుంది.


Click it and Unblock the Notifications











