Salaar: యూఎస్‌లో సలార్ సెన్సేషన్.. అప్పుడే అన్ని కోట్ల వసూళ్లు.. ఆ రికార్డు బద్దలవడం ఖాయం

పేరుకు తెలుగు హీరోనే అయినా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అందుకే ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు మీద సినిమాలు చేస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు.

ఈ జోష్‌లోనే ఈ పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు చేతి నిండా మూవీలు చేస్తున్నాడు. అందులో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'సలార్' ఒకటి. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం అదిరిపోయే ఫీట్‌ను సాధించింది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి!

Prabhas Starrer Salaar Movie Crossed 500K Dollar Mark in USA Premiere Advance Sales

సలార్‌గా వస్తున్న ప్రభాస్: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన సినిమానే 'సలార్'. ఈ మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇచ్చాడు. శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు సహా ఎంతో మంది ఇందులో నటిస్తున్నారు.

Prabhas Starrer Salaar Movie Crossed 500K Dollar Mark in USA Premiere Advance Sales

ఫస్ట్ పార్ట్ రిలీజ్ రెడీగానే: రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్‌ను 'సలార్: సీజ్‌ఫైర్‌'గా డిసెంబర్ 22న రిలీజ్ చేస్తుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. అలాగే, ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే మరో ట్రైలర్‌ను రిలీజ్ చేయడంతో పాటు భారీ ఈవెంట్లను కూడా చేయబోతున్నారు.

Prabhas Starrer Salaar Movie Crossed 500K Dollar Mark in USA Premiere Advance Sales

అక్కడ బుకింగ్ మొదలు: ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్: సీజ్‌ఫైర్‌' మూవీ రిలీజ్ డిసెంబర్ 22వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. త్వరలోనే తెలుగులో సైతం బుకింగ్స్ ఓపెన్ అవబోతున్నాయి.

అప్పుడే అన్ని డాలర్లతో: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. అక్కడ 340 లొకేషన్లలో 1104 షోలకు గానూ అమ్మకాలు ప్రారంభించగా.. ఇప్పటికే 20021 టికెట్లు కూడా అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇలా ఈ సినిమా అక్కడ అప్పుడే 539K డాలర్లను కూడా వసూలు చేసి సత్తా చాటుకుంది.

Prabhas Starrer Salaar Movie Crossed 500K Dollar Mark in USA Premiere Advance Sales

ఆ రికార్డు బద్దలవడమే: యూఎస్‌లో ప్రభాస్ సినిమాలకు అడ్వాన్స్ సేల్స్ అదిరిపోయే రీతిలో సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ 'ఆదిపురుష్' మూవీకి ప్రీమియర్స్‌ ద్వారా 825K డాలర్లు వచ్చాయి. ఇప్పుడు ఈ రికార్డును 'సలార్: సీజ్‌ఫైర్' బ్రేక్ చేయబోతున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. రిలీజ్‌కు ఇంకా 12 రోజుల సమయం ఉండడంతో 1 మిలియన్ మార్క్ కూడా దాటొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X