Salaar Nizam Collections బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిన సలార్.. నైజాంలో ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్ల షేరంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్నది. శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రీయారెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు భారీ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా పలు రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమాకు నైజాంలో బాహుబలి 2 రికార్డును బీట్ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

సలార్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తంగా 144 కోట్ల రూపాయల బిజినెస్ నమోదు చేసింది. నైజాంలోనే 70 కోట్లకుపైగా బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా నైజాంలో 72 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది.

Prabhas starrer Salaar Movie crosses Baahubali 2 Nizam share

అయితే సలార్ మూవీకి ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు రికార్డు స్తాయిలో నమోదయ్యాయి. నైజాంలో సలార్ మూవీ రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసింది. ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. గత 10 రోజులుగా కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది.

నైజాంలో సలార్ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజున ఈ సినిమా 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత తొలివారాంతానికి 45 కోట్ల షేర్ రాబట్టింది. ఫస్ట్ వీక్ ముగిసే సమయానికి ఈ చిత్రం 63 కోట్ల రూపాయలు షేర్ నమోదు చేసింది. ఇక గత 13 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ల మైలురాయిని అధిగమించింది.

Prabhas starrer Salaar Movie crosses Baahubali 2 Nizam share

నైజాంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో బాహుబలి 2 ఒకటిగా ఉంది. అయితే బాహుబలి 2 సినిమా కలెక్షన్లను సలార్ బ్రేక్ చేసింది. దాంతో నైజాం బాక్సాఫీస్ వద్ద సలార్ మూవీ సరికొత్త చరిత్రను సృష్టించింది. ప్రభాస్ తన పేరును ఉన్న రికార్డును తానే అధిగమించడం ట్రేడ్ వర్గాల్లో ఉత్సాహం నింపింది.

ఇదిలా ఉండగా, ఏపీ, తెలంగాణలో సలార్ సినిమా కలెక్షన్ల ప్రవాహం కొనసాగుతున్నది. ఈ సినిమా గత 13 రోజుల్లో 220 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం 440 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 600 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసి పఠాన్, జైలర్ బాక్సాఫీస్ కలెక్షన్లను అధిగమించింది.

Prabhas starrer Salaar Movie crosses Baahubali 2 Nizam share

సలార్ సినిమాకు సంబంధించి లాభాల్లోకి వెళితే.. ఈ సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ 350 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం హిందీ, తెలుగు కలిపి 440 కోట్లు, ఓవర్సీస్‌లో ఈ చిత్రం 134 కోట్లు షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 610 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసి భారీ లాభాలను సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X