Salaar: నైజాం గడ్డపై సలార్ ఊతకొట్టుడు.. అప్పుడే అన్ని కోట్లు.. ఫిల్మ్ హిస్టరీలోనే ప్రభాస్ రికార్డు

తెలుగులో ఎంతో మంది స్టార్లు సత్తా చాటుతోన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' నుంచి చెలరేగిపోతోన్న అతడు.. వరుసగా అతి భారీ బడ్జెట్ చిత్రాలతో సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'సలార్: సీజ్‌ఫైర్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ బెండు తీసే వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇలా తాజాగా చరిత్ర సృష్టించింది. ఆ వివరాలు మీకోసమే!

Recommended Video

చరిత్ర తిరగరాసిన రెబెల్ Prabhas కి మాత్రమే ఇది సాధ్యం | Salaar Boxoffice | Filmibeat Telugu

సలార్‌గా ప్రభాస్ ఊచకోత:ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమానే 'సలార్: సీజ్‌ఫైర్'. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు కీలక పాత్రల్లో నటించారు.

Prabhas Starrer Salaar Movie Crosses Rs 50 Crore Share in Nizam With in 4 Days

రికార్డు వసూళ్లతో అరాచకం:రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి మొదటి రోజే మంచి టాక్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా దీనికి రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్నాయి.

Prabhas Starrer Salaar Movie Crosses Rs 50 Crore Share in Nizam With in 4 Days

నైజాంలో అన్ని కోట్ల రచ్చ:హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ మొదటి రోజు షోలు ఫుల్ అయిపోయాయి. అయితే, నైజాం ఏరియాలో అత్యధిక రెస్పాన్స్ వచ్చింది. అక్కడ మంచి మార్కెట్ ఉండడంతో ఆ ఒక్క ప్రాంతంలోనే ఎక్కువ స్క్రీన్లలో ఇది విడుదలైంది. ఫలితంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో నాలుగు రోజుల్లోనే రూ. 50 కోట్లు వసూలు అయ్యాయి.

Prabhas Starrer Salaar Movie Crosses Rs 50 Crore Share in Nizam With in 4 Days

ఓవరాల్‌గా మూడో సినిమా:రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి నైజాంలో నాలుగు రోజుల్లోనే రూ. 50 కోట్లు షేర్ వచ్చింది. తద్వారా ఈ మార్కును దాటిన మూడో సినిమాగా ఇది సంచలన రికార్డును నమోదు చేసుకుంది. దీనికంటే ముందు నైజాంలో 'బాహుబలి 2', RRR చిత్రాలు రూ. 50 కోట్లు షేర్ మార్కును చేరుకున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ పెను సంచలనం:'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి నైజాం ఏరియాలో మంచి మార్కెట్ ఉంది. అందుకే అతడి సినిమాలకు అక్కడ గ్రాండ్‌ రిలీజ్ దక్కుతుంది. అదే సమయంలో వసూళ్లు కూడా భారీగానే వస్తుంటాయి. అందుకే నైజాం గడ్డపై రూ. 50 కోట్లు షేర్‌ను మూడు సినిమాలు దాటగా.. అందులో రెండు ప్రభాస్‌వే ఉన్నాయి. దీంతో సినీ చరిత్రలోనే అతడి పేరిట సంచలనం నమోదైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X