Salaar Day 1 Collections: రికార్డులు ఊదేసిన ప్రభాస్.. తొలి రోజే అన్ని కోట్లు.. ఇండియాలో టాప్ మూవీగా!

కొద్ది నెలలుగా ఇండియా వ్యాప్తంగా ట్రెండ్ అవుతూ హాట్ టాపిక్‌గా మారిపోయిన చిత్రాల్లో టాలీవుడ్‌కు చెందిన రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' ఒకటి. అంతలా ఈ మూవీ అన్ని విభాగాల్లోనూ రికార్డులు క్రియేట్ చేస్తూ ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో అంతటా ఈ మూవీ మేనియానే కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు తగ్గట్లుగానే దీనికి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఈ నేపథ్యంలో అసలు 'సలార్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

Recommended Video

Salaar Collections Report గ్రాస్ ఎంత ? షేర్ ఎంత? Prahjas Ruling Box Office | Filmibeat Telugu

సలార్‌గా వచ్చేసిన ప్రభాస్:ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన మూవీనే 'సలార్: సీజ్‌ఫైర్'. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు.

Prabhas Starrer Salaar Movie Day 1 Worldwide Box Office Collections

సలార్ బిజినెస్ ఎంతంటే:'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 120 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో రూ. 345 కోట్లు వ్యాపారం జరిగింది.

అలాంటి టాక్‌తో భారీగానే :హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాకు మొదటి రోజు అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేసిన విషయం తెలిసిందే.

Prabhas Starrer Salaar Movie Day 1 Worldwide Box Office Collections

తొలి రోజు తెలుగు కలెక్షన్లు:మొదటి రోజు 'సలార్: సీజ్‌ఫైర్' తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 22.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.72 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.70 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.10 కోట్లు, గుంటూరులో రూ. 4.50 కోట్లు, కృష్ణాలో రూ. 2.42 కోట్లు, నెల్లూరులో రూ. 1.85 కోట్లతో.. రూ. 50.29 కోట్లు షేర్, రూ. 71 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Prabhas Starrer Salaar Movie Day 1 Worldwide Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి తొలి రోజు తెలుగులో రూ. 50.29 కోట్లు, తమిళంలో రూ. 2.85 కోట్లు, కర్నాటకలో రూ. 6.00 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 26.80 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.49 కోట్లు షేర్, రూ. 167 కోట్లు గ్రాస్ వచ్చింది.

Prabhas Starrer Salaar Movie Day 1 Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది మొదటి రోజే దీనికి రూ. 97.49 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 249.51 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X