Salaar: బాహుబలి 2 వసూళ్లు దాటిన సలార్.. బాలయ్య రికార్డు టచ్ చేయలేకపోయిన ప్రభాస్

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుని.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా చిత్రాలతోనే సందడి చేస్తున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. అయితే, కొంత కాలంగా అతడు చేసిన సినిమాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు.

Recommended Video

Salaar ఆ హీరోల Record బ్రేక్ చేయలేదు..ఎందుకు? | Prabhas | Ram Charan | NBK | Filmibeat Telugu

ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాగైనా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో 'సలార్: సీజ్‌ఫైర్' అనే సినిమాను చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో రచ్చ లేపుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీడెడ్ ఏరియాలో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. వివరాల్లోకి వెళ్తే...

Prabhas Starrer Salaar Movie Gets 4th Place in Ceeded Day 1 Top Share Movies

సలార్‌గా రచ్చ చేసిన ప్రభాస్: ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన మూవీనే 'సలార్: సీజ్‌ఫైర్'. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు కీలక పాత్రలు చేశారు.

Prabhas Starrer Salaar Movie Gets 4th Place in Ceeded Day 1 Top Share Movies

అలాంటి టాక్.. సంబరాలతో: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. ఇందులో ప్రభాస్ వన్ మ్యాన్ షోతో ఇరగదీసేశాడని అభిప్రాయాలు వ్యక్తం అవుతోన్నాయి. దీంతో అటు అతడి ఫ్యాన్స్.. ఇటు చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది.

Prabhas Starrer Salaar Movie Gets 4th Place in Ceeded Day 1 Top Share Movies

మొదటి రోజు రికార్డు వసూళ్లు: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా దీనికి రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు.

సీడెడ్‌లో అన్ని కోట్లతో రచ్చ: యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ మొదటి రోజు షోలు ఫుల్ అయిపోయాయి. అయితే, సీడెడ్ ఏరియాలో అత్యధిక రెస్పాన్స్ వచ్చింది. అక్కడ మంచి మార్కెట్ ఉండడంతో ఆ ఒక్క ప్రాంతంలోనే ఎక్కువ స్క్రీన్లలో ఇది విడుదలైంది. ఫలితంగా ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో మొదటి రోజు ఏకంగా రూ. 6.45 కోట్లు షేర్‌ను వసూలు చేసింది.

Prabhas Starrer Salaar Movie Gets 4th Place in Ceeded Day 1 Top Share Movies

ప్రభాస్ టాప్ మూవీగా సలార్: 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి సీడెడ్‌లో మొదటి రోజే రూ. 6.45 కోట్లు షేర్ వచ్చింది. దీంతో ఈ గడ్డపై అత్యధిక కలెక్షన్లు సాధించిన ప్రభాస్ సినిమాగా ఇది రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే 'బాహుబలి 2' పేరిట ఉన్న రూ. 6.35 కోట్లు రికార్డును ఇది బ్రేక్ చేసుకుంది. అక్కడ ప్రభాస్ సినిమాల్లో బాహుబలి 1 రూ. 5.08 కోట్లు, సాహో రూ. 4.70 కోట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

Prabhas Starrer Salaar Movie Gets 4th Place in Ceeded Day 1 Top Share Movies

4వ స్థానం.. బాలయ్య కంటే: 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి ఫస్ట్ డే సీడెడ్‌లో రూ. 6.45 కోట్లు వసూలు కావడంతో అక్కడ అత్యధిక షేర్ రాబట్టిన చిత్రాల్లో ఇది నాలుగో స్థానానికి చేరింది. అక్కడ RRR రూ. 17 కోట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. 'వినయ విధేయ రామ' రూ. 7.15 కోట్లతో రెండో స్థానంలో ఉంది. అలాగే, బాలయ్య 'వీర సింహా రెడ్డి' రూ. 6.55 కోట్లు మూడో స్థానంలో కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X