Salaar: పరాయి దేశంలో ప్రభాస్ రికార్డు.. ఇండియాలోనే టాప్ మూవీగా సలార్
గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్‌లోని హీరోలు నటించే సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. అందులోనూ ఒక హీరో నుంచి వచ్చే చిత్రాలు సెన్సేషన్‌గా మారుతున్నాయి. అతడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కొంత కాలంగా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తోన్న అతడు.. వరల్డ్ వైడ్‌గానూ తనదైన రీతిలో బాక్సాఫీస్ బెండు తీస్తూనే ఉన్నాడు.
రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ప్రభాస్.. ఇప్పుడు 'సలార్ - సీజ్‌ఫైర్' అనే మూవీని పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే వస్తున్నారు.

వాస్తవానికి 'సలార్' మూవీ రిలీజ్ సెప్టెంబర్ 28వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే, ఉన్నట్లుండి ఈ సినిమాను వాయిదా వేయడంతో బుకింగ్స్ ఆగిపోయాయి. అయితే, ఇప్పుడు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో మళ్లీ బుకింగ్స్‌ను ఓపెన్ చేసేశారు.
'సలార్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో బజ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే చాలా ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా రిలీజ్ హక్కులను ప్రత్యంగిరా, మోక్ష సంస్థలు భారీ ధరకు సొంతం చేసుకున్నాయి. ఓవరాల్‌గా ఓవర్సీస్ రైట్స్‌ను ఫార్స్ ఫిలింస్ సంస్థ దక్కించుకుంది.

'సలార్' మూవీని డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీమియర్స్‌ను డిసెంబర్ 21న వేయబోతున్నట్లు ఓవర్సీస్ బిజినెస్ చేసుకున్న సంస్థలు వెల్లడించాయి. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి నార్త్ అమెరికాలోనే ఏకంగా 1979 లొకేషన్లలో ప్రీమియర్స్ వేయబోతున్నట్లు తెలిపాయి. దీంతో అక్కడ అత్యధిక లొకేషన్లలో రిలీజ్ అవుతున్న చిత్రంగా ఇది రికార్డు సాధించింది.
ఇక, 'సలార్' చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











