Salaar Business: సలార్ బిజినెస్ అన్ని వందల కోట్లు.. చరిత్ర సృష్టించిన ప్రభాస్.. హిట్ కావాలంటే మాత్రం!
హీరోగా పరిచయం అయినప్పటి నుంచే టాలీవుడ్‌లో ప్రభావాన్ని చూపించి.. ఈ మధ్య కాలంలో ఇండియా వ్యాప్తంగా ఫాలోయింగ్, మార్కెట్‌ను పెంచుకుని దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కొంత కాలంగా పాన్ ఇండియా చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. ఇప్పుడు 'సలార్: సీజ్‌ఫైర్' అనే మూవీతో ఆడియెన్స్‌ను అలరించబోతున్నాడు.
అందుకు అనుగుణంగానే ఈ చిత్రం హడావిడి ముందుగానే మొదలైంది. ఈ నేపథ్యంలో 'సలార్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఎంత జరిగింది? ఎంత వసూలు చేస్తే ఇది హిట్ అవుతుంది? చూద్దాం పదండి!

సలార్‌గా ప్రభాస్ అరాచకం: ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న యాక్షన్ మూవీనే 'సలార్'. దీన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇచ్చాడు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు సహా ఎంతో మంది నటించారు.

హై ఓల్టేజ్ యాక్షన్ స్టోరీతో: ఇద్దరు స్నేహితుల శత్రువులుగా ఎలా మారారు అన్న కాన్సెప్టుతో తెరకెక్కిన చిత్రమే 'సలార్'. ఈ మూవీ మొదటి పార్టును 'సలార్: సీజ్‌ఫైర్' అనే టైటిల్‌తో తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇక, ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల కాబోతుంది. దీంతో ఈ మూవీ హడావిడి ఫుల్‌గా కనిపిస్తోంది.

గ్రాండ్‌గా రిలీజ్.. ప్రమోషన్: యాక్షన్ నేపథ్యంతో రాబోతున్న 'సలార్: సీజ్‌ఫైర్' మూవీని డిసెంబర్ 22న ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు. అయినా ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అన్ని ఏరియాల్లోనూ దీనికి అదిరిపోయే స్పందన వస్తోంది.

అన్ని భాషల్లో భారీ డిమాండ్: క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్: సీజ్‌ఫైర్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.
ఆంధ్రా, తెలంగాణ బిజినెస్: ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలను కలిపి రూ. 60 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రభాస్ మూవీకి రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమా కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు వ్యాపారం జరిగింది.
అన్ని కోట్ల టార్గెట్.. రికార్డు: 'సలార్: సీజ్‌ఫైర్' సినిమాకు రూ. 345 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 347 కోట్లు షేర్ వసూలు అయితేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రాల జాబితాలో ఇది మూడో స్థానానికి చేరింది. అంతేకాదు, హయ్యెస్ట్ బిజినెస్ చేసిన టాప్ 5 చిత్రాల్లో నాలుగు మూవీలతో ప్రభాస్ రికార్డు కొట్టాడు.


Click it and Unblock the Notifications











