ఇండియన్ బాక్సాఫీస్ రారాజు ప్రభాస్.. టాప్-5 అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే!

ఇండియన్ బాక్సాఫీస్ రారాజుఎవరు? అంటే ప్రేక్షకుల నుంచి వినిపించే ఏకైక సమాధానం... పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. తెలుగు హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన, నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం భారతదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించే హీరోల్లో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన సినిమా ఏదైనా సరే వందల కోట్లు వసూళ్లు చేస్తుంది.

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ మార్కెట్.. ఇప్పుడు ఉత్తరాది నుంచి అమెరికా వరకు విస్తరించింది. ముఖ్యంగా 'బాహుబలి' తర్వాత ఆయన మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. ప్రభాస్ సినిమా విడుదల అవుతుందంటే చాలు.. ముందుగానే రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయి. టాక్ ఎలా ఉన్నా తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించడం ప్రభాస్ సినిమాల ప్రత్యేకతగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కెరీర్ లో టాప్-5 అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఏంటో ఓ లూక్కేద్దాం.

Prabhas Top 5 Highest Grossing Movies The Box Office King of Indian Cinema

బాహుబలితో మారిపోయిన ప్రభాస్ కెరీర్
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1 (Baahubali: The Beginning)తో ప్రభాస్ కెరీర్ కొత్త మలుపు తిరిగింది. అప్పటి వరకు తెలుగు స్టార్‌గా ఉన్న ఆయన ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆ సినిమా సుమారు రూ.650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లోనూ ఘన విజయాన్ని సాధించింది. అప్పటివరకు దక్షిణాది సినిమాలకు ఉత్తరాదిలో ఉన్న పరిమిత మార్కెట్‌ను ఈ సినిమా పూర్తిగా మార్చేసింది.

బాహుబలి 2.. చెక్కుచెదరని రికార్డు
ప్రభాస్ కెరీర్‌లోనే కాదు.. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో ఒకటి బాహుబలి 2 (Baahubali 2: The Conclusion). రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,788 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. భారత్‌లోనే రూ.1,030 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించడం ఒక సంచలనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడుబోవడం కూడా ఈ సినిమా ప్రత్యేకత. చాలా సంవత్సరాల పాటు భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా రికార్డు కొనసాగింది. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ఒక్క ప్రశ్నే దేశవ్యాప్తంగా భారీ ఆసక్తిని సృష్టించింది. ఆ ఆసక్తి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది.

కల్కి 2898 AD.. సైన్స్ ఫిక్షన్‌లో ప్రభాస్ సత్తా
2024లో విడుదలైన Kalki 2898 AD ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా దాదాపు రూ.1,042 నుంచి రూ.1,200 కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.615 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన ఈ సినిమా, ఉత్తర అమెరికాలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, మహాభారత నేపథ్యం, ప్రభాస్ స్టార్ పవర్ కలిసి ఈ సినిమాను గ్లోబల్ హిట్‌గా మార్చాయి.\

సలార్.. మాస్ యాక్షన్‌తో కలెక్షన్ల సునామీ
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ 1 (Salaar: Part 1 - Ceasefire) ప్రభాస్ అభిమానులకు పండుగలా మారింది. భారీ యాక్షన్ ఎలిమెంట్స్, మాస్ ఎలివేషన్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా తొలి రోజే రూ.90 కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇండియాలోనే రూ.404 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన ఈ సినిమా విదేశాల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. కొంతమంది ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం.. సలార్ మూవీ రూ.700 కోట్లకు చేరువైన గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది.

సాహో.. ఫ్లాప్ టాక్ వచ్చినా వందల కోట్ల వసూళ్లు
ప్రభాస్ మార్కెట్ స్థాయిని చెప్పడానికి సాహో (Saaho) మంచి ఉదాహరణ. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.419 నుంచి రూ.439 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోయినా హిందీ మార్కెట్‌లో మాత్రం ఈ సినిమా అద్భుతంగా ఆడింది. హిందీలోనే రూ.140 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించి ప్రభాస్‌కు ఉత్తరాదిలో ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. సాధారణంగా ఫ్లాప్ టాక్ వస్తే కలెక్షన్లు పడిపోతాయి. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం అది జరగలేదు.

ప్రస్తుతం ప్రభాస్ టాప్-5 అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉండగా, కల్కి 2898 AD రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత సలార్, బాహుబలి ది బిగినింగ్, సాహో సినిమాలు నిలిచాయి. ఈ ఐదు సినిమాలే కలిపి దాదాపు రూ.4,500 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఒక హీరో కెరీర్‌లో ఇంత భారీ స్థాయిలో బాక్సాఫీస్ విజయాలు సాధించడం అరుదైన విషయం. అందుకే ప్రభాస్‌ను అభిమానులు "ఇండియన్ బాక్సాఫీస్ రారాజు"గా పిలుస్తుంటారు.

ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సలార్ 2, స్పిరిట్, కల్కి 2 వంటి భారీ ప్రాజెక్టులపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలు విడుదలైతే ప్రభాస్ తన సొంత రికార్డులనే తిరగరాయడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం చూస్తే.. ఆయన స్థాయిని అందుకోవడం ఇతర హీరోలకు అంత ఈజీ కాదనే చెప్పాలి.

Read more about: baahubali 2 kalki 2898 ad prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X