Kalki 2898 AD Collections: జపాన్‌లో ప్రభాస్‌కు దిమ్మతిరిగే క్రేజ్.. కల్కి 2898 AD దెబ్బకు RRR కలెక్షన్స్ రికార
తెలుగు సినిమా ఖ్యాతి ఓ రేంజ్ లో ఎగబాకిన తర్వాత మన నుంచి ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అని వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఇపుడు నెలకొన్నాయి. కాగా ప్రపంచ సినిమా దగ్గర టాలీవుడ్ ని ఇంకో లెవెల్లో పెట్టే ప్రయత్నంలో డెఫినెట్ గా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పాత్ర చాలా అంటే చాలా కీలకం అని చెప్పవచ్చు.
తన బాహుబలి సినిమా తర్వాత తాను తెలుగు స్టేట్స్ నుంచి పాన్ ఇండియా అక్కడ ప్రపంచ పలు దేశాల్లో కూడా మంచి క్రేజ్ ని అంతే కాకుండా మంచి మార్కెట్ ని కూడా తాను సొంతం చేసుకున్నాడు. కాగా ప్రభాస్ కి మంచి మార్కెట్ ఉన్న దేశాల్లో జపాన్ కంట్రీ కూడా ఒకటి. తన బాహుబలి సినిమా నుంచే ప్రభాస్ కి మంచి క్రేజ్ అక్కడ నెలకొనగా ఇపుడు తాను నటించిన రీసెంట్ భారీ సినిమా "కల్కి 2898 ఎడి" ఈ జనవరి 3న బ్రహ్మాండంగా విడుదల అయ్యింది.

ఇక ఈ సినిమా అక్కడ రికార్డు ఓపెనింగ్స్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. కాగా జపాన్ దేశంలో ఇండియన్ సినిమా నుంచి వెళ్లిన సినిమాల్లో ప్రభాస్ సినిమాల డామినేషన్ నే ఎక్కువ కనిపించడం గమనార్హం. కాగా అక్కడ టాప్ 10 సినిమాలు చూసినట్టు అయితే మొదటి రోజు అత్యధిక ఫుట్ ఫాల్స్ పడిన సినిమాల్లో ఒక్క ప్రభాస్ నుంచే మొత్తం నాలుగు సినిమాలు ఉండడం గమనార్హం.
అది కూడా టోటల్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్న అందరు హీరోలలో కూడా ప్రభాస్ ఒక్కడికే ఈ రికార్డు సొంతం అయ్యింది. కాగా జపాన్ లో మొదటి రోజు అత్యధికంగా ఫుట్ ఫాల్స్ నమోదు అయ్యిన టాప్ 10 సినిమాలు చూసుకున్నట్టు అయితే మొదటిగా జపాన్ ఇండస్ట్రీ హిట్ RRR సినిమా 8300 వేలకి పైగా నమోదు అయితే రెండో స్థానంలో ప్రభాస్ నటించిన సాహో 6500, 3. కల్కి 2898 ఎడి - 3700+, 4. సలార్ - 2200+, 5. పఠాన్ - 2190+, 6. జవాన్ -1960+, 7. రంగస్థలం - 1660+, 8. బాహుబలి 2 - 1380+, 9.టైగర్ 3 - 1300+, 10. దంగల్ - 1260+ ఫుట్ ఫాల్స్ వరుసగా నమోదు అయ్యినట్టు తెలుస్తుంది.

దీనితో ఇంట్రెస్టింగ్ గా ఈ 10 సినిమాల్లో ప్రభాస్ నుంచే సాహో, కల్కి 2898 ఎడి, సలార్ అలాగే బాహుబలి 2 సినిమాలుతో లీడ్ లో జపాన్ మార్కెట్ లో తిరుగు లేని ఇండియన్ హీరోగా నిలిచాడు. మరి ఇపుడు రిలీజ్ అయ్యిన కల్కి సినిమా అక్కడ ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి మరి. ఆల్రెడీ అక్కడ బిలియన్స్ వసూళ్లతో RRR కొత్త రికార్డులు సెట్ చేసింది. మరి దీనిని ఈ ఎపిక్ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











