ప్రభాస్ సినిమా కోసం స్టార్ డైరెక్టర్ మరో షాకింగ్ నిర్ణయం.. 20 నిమిషాల కోసం రూ.75కోట్లు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో చాలా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్న ఏకైక హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయి అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక ప్రస్తుతం లైనప్ లో ఉన్న సినిమాలకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఒక సినిమాలోని క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం అయితే ఒక స్టార్ దర్శకుడు ఏకంగా 75కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా టాక్ వస్తోంది. ఇక ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

కొంచెం కూడా తగ్గలేదు

కొంచెం కూడా తగ్గలేదు

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. సాహో అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి డార్లింగ్ మార్కెట్ అయితే కొంచెం కూడా తగ్గలేదు. తరువాత రాబోయే సినిమాలు కూడా అంతకుమించి అనేలా ఉంటాయని మరో క్లారిటీ అయితే వచ్చింది. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా రాధేశ్యామ్ సినిమాపైనే ఉంది.

 సలార్ సినిమాపైనే..

సలార్ సినిమాపైనే..

రాధేశ్యామ్ సినిమా సంక్రాంతికి రావాల్సింది. కానీ కరోనా కారణంగా ఆ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. మార్చిలో వస్తుందని అంటున్నారు కానీ ఇంకా వచ్చే వరకు నమ్మడానికి వీలు లేదు. ఇక మరోవైపు ఆడియెన్స్ ఫోకస్ ఎక్కువగా సలార్ సినిమాపైనే ఉంది. ఆ సినిమాని KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో పాన్ ఇండియా యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. తప్పకుండా సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందని చెప్పవచ్చు.

రెండు భాగాలుగా..

రెండు భాగాలుగా..

సలార్ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. తండ్రి పాత్రలో అలాగే కొడుకు పాత్రలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉండేలా దర్శకుడు స్క్రీన్ ప్లేను రాసుకున్నాడట. ఇక ఆ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలలో వైరల్ గా మారింది. దర్శకుడు ప్రశాంత్ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్రస్తావన తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

అదే ఫార్మాట్ లో..

అదే ఫార్మాట్ లో..

సినిమా కథను రెండు భాగాలుగా కూడా చెప్పే విధంగా అవకాశం ఉందని కంటెంట్ కూడా చాలానే ఉందని ఇటీవల ప్రభాస్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఆ విషయంలో ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే KGF సినిమాను రెండు భాగాలు చేసిన ప్రశాంత్ ఇప్పుడు సలార్ ను కూడా అదే ఫార్మాట్ లో విడుదల చేసి హిట్టు కొట్టాలని అనుకుంటున్నారట.

Recommended Video

Prabhas Project K| AP Movie Tickets Rates| Tollywood Updates | Filmibeat Telugu
ఆ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు

ఆ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు

ఇక సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. సలార్ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ ఎపిసోడ్ లో యాక్షన్ సన్నివేశాల కోసం దాదాపు 75కోట్లు ఖర్చు చేస్తున్నారాట. ఆ సీన్స్ సినిమా చివరలో కేవలం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల మధ్యలో ఉంటాయట. మరి ఆ సీన్స్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X