షాకింగ్‌గా సాహో 11 రోజు కలెక్షన్లు: డైహార్డ్ ఫ్యాన్స్‌తో AMBలో పండుగ చేసుకొన్న ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ప్రతికూల పరిస్థితుల మధ్య రూ.400 కోట్ల క్లబ్‌వైపు పరుగులు పెడుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో మినహాయిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీ వెర్షన్ సాహోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నది. ఒడిదుడుకుల మధ్య ప్రదర్శింపబడుతున్న సాహో సినిమాను ప్రభాస్ తన అభిమానులతో కలిసి హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్‌లో వీక్షించారు. ఫ్యాన్స్ కేరింతలు, ఈలల మధ్య ప్రభాస్ ఉత్సాహంగా కనిపించారు.

ఏఎంబీలో ఫ్యాన్స్‌తో కలిసి
సాహో సినిమాకు ముందు వెకేషన్‌కు వెళ్లొచ్చిన ప్రభాస్ ఇటీవలే హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. పోస్టు రిలీజ్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్న ఆయన సోమవారం (సెప్టెంబర్ 9వ తేదీన) తన డైహార్డ్ ఫాన్స్‌ను ఏఎంబీ సినిమాస్‌లో కలిశారు. డార్లింగ్ ప్రభాస్‌ను చూసి ఫ్యానస్ థ్రిల్‌గా ఫీలయ్యారు.

ఫ్యాన్స్ హంగామా మధ్య
తన అభిమానులతో కలిసి AMB స్క్రీన్స్‌లో ప్రభాస్ సాహోని వీక్షించారు, తమ అభిమాన హీరోతో కలిసి బ్లాక్‌బస్టర్ మూవీ సాహోని చూసే అవకాశం దక్కినందుకు ఫాన్స్ కేరింతలతో థియేటర్ మారుమోగింది. ప్రభాస్‌తోపాటు నిర్మాత ప్రమోద్ కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరయ్యారు.

ఉత్తరాదిలో వసూళ్లు
ఇదిలా ఉండగా, సాహో మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకాదరణ అతంత మాత్రమే కనిపిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఉత్తరాదిలో సాహో సినిమాకు ఎదురేలేకుండా పోతున్నది. బీహార్, యూపీ, ఢిల్లీలో భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. గత పది రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్ల షేర్, రూ.381 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు
సాహో నైజాంలో రూ.40 కోట్లు, సీడెడ్‌లో రూ.23 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆంధ్రాలో సాహో మాదిరి కలెక్షన్లను రాబట్టింది. గుంటూరులో రూ.10 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.9.6 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.15 కోట్లు, తూర్పు రూ.10.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ8.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.4.56 కోట్లు వసూలు చేసింది. ఇక కర్ణాటకలో రూ.28 కోట్లు, తమిళనాడులో 15 కోట్లు, కేరళలో 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.45 కోట్ల షేర్ సాధించింది.

11వ రోజున వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డే కావడంతో వసూళ్లు భారీగా క్షీణించినట్టు సమాచారం. 11వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1 కోటి రూపాయల షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఈ చిత్రం రూ.130 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











