కల్కి మరో బాక్సాఫీస్ సంచలనం.. షారుక్, సల్మాన్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను మడతపెట్టిన ప్రభాస్
కల్కి 2898 AD సినిమా హిందీలో ఇద్దరు సూపర్ స్టార్స్ రికార్డులను బ్రేక్ చేసింది. ఉత్తర భారతంలో ఓ వైపు ప్రకృతి వైపరిత్యాలు, తుఫాన్ విధ్వంసం సృష్టిస్తుంటే.. మరో వైపు బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ నటించిన ఈ సినిమా హిందీలో కాసుల వర్షం కురిపిస్తున్నది. ఈ సినిమా 14వ రోజున హిందీ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ రికార్డులను అధిగమించింది. ఆ రికార్డుల వివరాల్లోకి వెళితే..
కల్కి చిత్రం హిందీలో భారీగా కలెక్షన్లు రాబడుతున్నది. తొలి రోజు నుంచి ఈ సినిమా వసూళ్ల దుమారం క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రం తొలి రోజున 22.5 కోట్ల రూపాయలు, 2వ రోజు 23 కోట్ల రూపాయలు, 3వ రోజు 26 కోట్ల రూపాయలు, 4వ రోజు 40 కోట్ల రూపాయలు, 5వ రోజు 16.5 కోట్ల రూపాయలు, 6వ రోజు 13 కోట్ల రూపాయలు, 7వ రోజు 11.3 కోట్ల రూపాయలు, 8వ రోజు 10.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం హిందీలో 162.5 కోట్ల రూపాయలు తొలివారం వసూలు చేసింది.

ప్రభాస్ నటించిన ఈ చిత్రం 9వ రోజు 9.4 కోట్లు, 10వ రోజు 18 కోట్లు, 11వ రోజు 22.5 కోట్లు, 12వ రోజు 6.5 కోట్ల రూపాయలు, 13వ రోజు 5.4 కోట్లు, 14వ రోజు 4.6 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా రెండు వారాల్లో 229 కోట్లు కలెక్షన్లను నమోదు చేసింది.
దాంతో ఈ సినిమా షారుక్ ఖాన్, దీపిక పదుకోన్ జంటగా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించి. షారుక్ సినిమా 227 కోట్లు రూపాయలు కలెక్షన్ల రికార్డును కల్కి బ్రేక్ చేసింది. ఈ రికార్డు బ్రేక్ కేవలం రెండు వారాల్లోనే అధిగమించడం రికార్డుగా మారింది.

చెన్నై ఎక్స్‌ప్రెస్ లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించిన కల్కి మరో షారుక్ ఖాన్ సినిమా వసూళ్లను బ్రేక్ చేసేందుకు రెడీ అయింది. ఇటీవల రిలీజైన డంకీ సినిమా 232 కోట్ల రూపాయల లైఫ్ టైమ్ కలెక్షన్లను బ్రేక్ చేయనున్నది.
ఇక సల్మాన్ ఖాన్ నటించిన కిక్ 2 సినిమా రికార్డుపై కన్నేసింది. కిక్ 2 సినిమా తన లైఫ్ టైమ్ కలెక్షన్లు 233 కోట్ల రూపాయల వసూళ్లను బ్రేక్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ సినిమా త్వరలోనే బాలీవుడ్ హీరోల కలెక్షన్లను తుడిచిపెట్టే జైత్రయాత్రను కొనసాగిస్తున్నది.


Click it and Unblock the Notifications











