Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
30రోజుల్లో ప్రేమించడం ఎలా? క్లోజింగ్ కలెక్షన్స్.. ప్రదీప్ మూవీకి వచ్చిన మొత్తం లాభం ఎంతంటే?
టెలివిజన్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న యాంకర్ ప్రదీప్ హీరోగా కూడా మొదటి అడుగులోనే సక్సెస్ అందుకున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ బాగానే అందుకున్నాడు. రీసెంట్ గా సినిమా సందడి ముగిసింది. ఇక మొత్తం వచ్చిన క్లోజింగ్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..
పాటతోనే బజ్ క్రియేట్ చేసి..
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా ముందు నుంచి ఓ వర్గం ఆడియెన్స్ లో అయితే అంచనాలను బాగానే క్రియేట్ చేసింది. ఇటీవల ట్రైలర్ ను కూడా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకుముందు నీలి నీలి ఆకాశం పాట ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యూ ట్యూబ్ లో ఆ సాంగ్ 300మిలియన్ల వ్యూవ్స్ ను అందుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.
వాళ్ళ సపోర్ట్ తో..
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాను గత ఏడాది సమ్మర్ లోనే విడుదల చేయాల్సింది. కరోనా లాక్ డౌన్ కంటే ముందే సినిమాను రెడీ చేశారు. కానీ లాక్ డౌన్ దెబ్బకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా సినిమా యూవీ క్రియేషన్స్ గా GA2 సపోర్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ఓపెనింగ్స్ తోనే పికప్ అయ్యింది.
ఆ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చిన సినిమా
సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే ఉన్నప్పటికీ ఆ టార్గెట్ ను ప్రదీప్ అందుకుంటాడా లేదా అనేది మొదట్లో కాస్త అనుమానాలు కలిగించింది. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 4కోట్లకు పైగానే ధర పలికింది. 4.80కోట్ల టార్గెట్ తో విడుదల కాగా సినిమా రెండు రోజుల్లోనే 2కోట్లకు పైగా షేర్స్ అందుకోవడం విశేషం.
ఎంత ప్రాఫిట్స్ అందించింది అంటే..
ఇక సినిమా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే 6.71కోట్ల వరకు షేర్స్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా 7.23కోట్లు వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడికి ఈ సినిమా 2.44కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. మొత్తానికి యాంకర్ ప్రదీప్ బాక్సాఫీస్ వద్ద మొదటి సూపర్ హిట్ ను అందుకోవడంతో ఆఫర్స్ చాలానే వస్తున్నాయట. మరి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.
ప్రదీప్ రెమ్యునరేషన్..?
ప్రదీప్ సినిమా కథ బాగా నచ్చడం వలన రెమ్యునరేషన్స్ ఇవ్వకపోయినా కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సినిమా క్వాలిటీ విషయంలో నిర్మాత ఏ మాత్రం తగ్గలేదు. ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్నాడు. ఫైనల్ గా లాభాల్లో కొంత షేర్స్ అందుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.