Pradeep machiraju 30 రోజుల్లో కలెక్షన్లు ఫేకా? క్లారిటీ ఇచ్చిన ట్రేడ్ వర్గాలు
యాంకర్ ప్రదీప్ హీరోగా మారి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు. అయితే సినిమాపై టాక్, రివ్యూలు ఎలా ఉన్నా గానీ కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయని చిత్రయూనిట్ ప్రకటిస్తోంది. ఈ మేరకు సినిమా కలెక్షన్లపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో సినిమా కలెక్షన్లపై అందరికీ అనుమానాలు రావడంపై ఎన్నో అనుమానాలున్నాయి.

ఒక్కపాటతో..
30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఈసినిమాను ఇంతటి హైప్ క్రియేట్ అవ్వడానికి అసలు సిసలు కారణం ఆ పాట. నీలి నీలి ఆకాశం అనే పాటతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఒక్క పాటను ముందు పెట్టి సినిమా అంతటి నడిపించడం అంటే మామూలు విషయం కాదు.

అది మినహా ఏమీ లేదు..
ప్రదీప్ అమృత అయ్యర్‌లు క్రౌడ్ పుల్లింగ్ ఫ్యాక్టర్స్ ఏమీ కాదు. అంతో ఇంతో ప్రదీప్ ఫాలోయింగ్ సినిమాకు ఉపయోగపడింది. అయితే బుల్లితెరపై కనిపించే ప్రదీప్ వేరులా ఉంటాడు.. వెండితెరపై హీరోగా రెండున్నర గంటలు కనిపించేటప్పుడు వేరుగా ఉంటాడు. అక్కడే కాస్త తేడా కొట్టేసింది.

సక్సెస్ మీట్‌లు..
30 రోజుల్లో ప్రేమించడం ఎలా మొదటి ఆట నుంచి రివ్యూలు, టాక్ కాస్త నెగెటివ్‌గానే వచ్చాయి. కానీ వెంటనే సక్సెస్ మీట్‌లుపెట్టేయడం, మొదటి రోజే నాలుగు కోట్లు వచ్చాయని ప్రకటించడం వంటివి చూసి కొందరు షాక్ అయ్యారు. అయితే ఇందులో ఎంత నిజముందో అంటూ గుసగుసలు వినిపించాయి.

ట్రేడ్ వర్గాల లెక్కలు..
మేకర్స్ ప్రకటిస్తున్న లెక్కల్లో ఎలాంటి తేడాలు లేవనే విషయాన్ని సినీ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. టాక్గా ఎలా ఉన్నా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టగా.. ప్రదీప్ హీరోగా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడనే మాట వినిపిస్తున్నది. దర్శకుడు మున్నాకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
Recommended Video

ఎప్పుడూ ఉండే చర్చే..
మిక్స్డ్ టాక్, నెగెటివ్ రివ్యూలు వచ్చిన సినిమాలకు మంచి కలెక్షన్లు వచ్చిన సమయంతో ప్రతీసారి ఇలాంటి చర్చలు వస్తూనే ఉంటాయి. చిత్రయూనిట్ ప్రకటించే పోస్టర్లు, చెప్పే లెక్కల్లో ఎంత వాస్తవం ఉంటుందో నెటిజన్లకు, జనాలకు ఇట్టే తెలిసిపోతుంటుంది. సినిమాను ఇంతలా ఆదరిస్తున్నందుకు నేడు చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించనుంది.


Click it and Unblock the Notifications











