Dragon Day 10 Collections:‘డ్రాగన్’ 10వ రోజు కలెక్షన్లు..ప్రదీప్ రంగనాథన్ బాక్సాఫీస్ ఊచకోత..సెన్సేషన్ వసూళ్లు?

'డ్రాగన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు రూ.100 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిన్నా సినిమాగా వచ్చి సునాయసంగా వంద కోట్లు కొల్లగొట్టడంతో ట్రేండ్ పండింతులు ఆశ్చర్యపోతున్నారు. డే10న కూడా ఈ చిత్రానికి ఓ రేంజ్ లో కలెక్షన్లు అందడం విశేషం. 'లవ్ టుడే' చిత్రంతో రెండేళ్ల కింద హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రదీప్ రంగనాథన్ మరోసారి సంచలనంగా మారారు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ షాకింగ్ గా కలెక్షన్లు రాబడుతున్నాడు యంగ్ హీరో.

'డ్రాగన్' కలెక్షన్ల విషయానికి వస్తే.. ఫస్ట్ డేనే ఈ చిత్రం ఇండియాలో రూ.6.5 కోట్లు నెట్ వసూళ్లు చేసింది. ఇక డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ కలెక్షన్లు అందుకుని బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపించింది. ఇక రెండో వారంలోనూ అదే జోరు కనిపిస్తోంది. సెకండ్ వీక్ లో డే8న రూ.4.7 కోట్ల నెట్ వసూలవ్వగా.. అందులో తమిళం రూ.3.85 కోట్లు, తెలుగు రూ.0.85 కోట్ల నెట్ రాబట్టగలిగింది. అలాగే డే9న ఇండియాలో నెట్ రూ.8.5 కోట్లు అందుకుంది. ఇందులో తమిళంలో రూ.6.85 కోట్లు కాగా.. తెలుగులో రూ.1.65 కోట్ల నెట్ వసూళ్లు చేసింది.

Pradeep Ranganathan Anupama Parameswaran Dragon Movie Day 10 Box Office Collections Worldwide

ఇక ఈ చిత్రం.. రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 'డ్రాగన్' యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రదీప్ రంగనాథన్ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. గతంలో 'లవ్ టుడే' చిత్రం కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఆశ్చర్యపరిచింది. మరోసారి 'డ్రాగన్'తో ప్రదీప్ హండ్రెడ్ క్రోస్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక డే10న కలెక్షన్లు జోరుగా అందాయి. సెకండ్ ఆదివారం కావడంతో రూ.9 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. వీటికి మరిన్ని కలెక్షన్లు యాడ్ కావాల్సి ఉంది. దాంతో రూ.10 కోట్ల వరకు నెట్ వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

మరోవైపు.... తొమ్మిది రోజుల్లో 'డ్రాగన్' చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.95.00 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. ఇండియాలో రూ.63.50 కోట్లకు పైగా నెట్, రూ.73.40 కోట్ల గ్రాస్ వసూల్ ను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో రూ.21.60 కోట్ల గ్రాస్ అందుకుంది. మొదటి వారంలోలాగానే రెండో వారంలోనూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూకుడుగా వ్యవహరిస్తోంది.

ఇక మార్చి 7 నుంచి తెలుగులోకి బాలీవుడ్ సెన్సేషనల్ ఫిల్మ్ 'ఛావా' తెలుగు వెర్షన్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడ జోరుగానే వసూల్ చేస్తున్న 'డ్రాగన్' పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుందనేది చూడాలి. తట్టుకోగలిగితే నెలపాటు ప్రదీప్ రంగనాథన్ చిత్రానికి వసూళ్ల పండగే అంటున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహార్ హీరోయిన్లుగా నటించారు. ఏజీఎస్ తమిళంలో సొంతంగా రిలీజ్ చేసుకోగా.. తెలుగులో ఏషియన్ సురేష్ డిస్టిబ్యూటర్స్ విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X