Dragon Day 11 Collections:‘డ్రాగన్’ 11వ రోజు కలెక్షన్లు..100 కోట్ల క్లబ్ ఎంట్రీతో..ప్రదీప్ సరికొత్త రికార్డు!
తమిళ డైరెక్టర్, హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'డ్రాగన్'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'డ్రాగన్' రూ.100 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ గా మారింది. ఇంకా వసూళ్లు రాబడుతూనే వస్తోంది. 2వ వారంలో ఈ చిత్రం జోరు ఏమాత్రం తగ్గడం లేదు. చిన్నా సినిమాగా థియేటర్లలోకి అడుపెట్టినా.. సునాయసంగా వంద కోట్లు కొల్లగొట్టిందీ చిత్రం. మొదటి వారంలో రోజుకు రూ.8 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఆశ్చర్య పరిచింది.
డే10న, డే11న కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు అందడం విశేషం. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికే పదిరోజుల్లో 'డ్రాగన్' చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.111.00 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. ఇండియాలో రూ.72.50 కోట్లకు పైగా నెట్, రూ.83.70 కోట్ల గ్రాస్ వసూల్ ను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో రూ.27.30 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది. కేవలం పదిరోజుల్లో ఈ రేంజ్ కలెక్షన్లు రావడం విశేషంగా మారింది.

ఇక డే11న కలెక్షన్లు ఇలా ఉన్నాయి. డే10న రూ.9 కోట్లు సంపాధించిన ఈ చిత్రం డే11న మాత్రం కలెక్షన్ల జోరు తగ్గించింది. రెండో శని, ఆదివారాల్లో కుమ్మేసిన 'డ్రాగన్', సోమవారం వర్కింగ్ డే కావడంతో వసూళ్ల విషయంలో కాస్తా తడబడింది. అయినా... 11వ రోజు రూ.2.25 కోట్ల వరకు నెట్ వసూల్ చేసింది. ఇందులో తమిళంలో రూ.1.94 కోట్లు నెట్ రాబట్టగా.. తెలుగు స్టేట్స్ లో రూ.55 లక్షల వరకు నెట్ వసూళ్లు అందుకుంది. ఇక డే11 వరకు కేవలం తమిళంలోనే ఈ చిత్రం రూ.60.84 కోట్ల నెట్ రాబట్టింది. ఇక తెలుగులో రూ.14.15 కోట్ల నెట్ వసూల్ చేయడం విశేషం.
ఇక ఇండియాలో మొదటిరోజే రూ.6.5 కోట్లు నెట్ వసూళ్లు చేసి అదరగొట్టింది. ఇక డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్, డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్లు, డే10న రూ.9కోట్ల నెట్ అందుకుంది. డే11న రూ.2.25 కోట్లు నెట్ అందుకోవడంతో.. కేవలం ఇండియాలోనే రూ.83.7 కోట్ల గ్రాస్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.111 కోట్ల గ్రాస్ అందుకోని సెన్సేషన్ గా మారింది.
ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రదీప్ రంగనాథన్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఈ యంగ్ హీరో గతంలో 'లవ్ టుడే' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 2022లో వచ్చిన ఈ సినిమా రూ.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. రూ.105 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. హీరోగా ప్రదీప్ రంగనాథన్ తొలి సినిమానే బాక్సాఫీస్ కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మళ్లీ 'డ్రాగన్' చిత్రంతో రూ.100 కోట్ల క్లబ్ లో చేరి సంచలనంగా మారాడు. అయితే హీరోగా వరుసగా తొలి రెండు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన హీరోగా ప్రదీప్ రంగనాథన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఇక అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహార్ హీరోయిన్లుగా నటించారు.


Click it and Unblock the Notifications











