Dragon Day 12 Collections : ‘డ్రాగన్’ 12వ రోజు కలెక్షన్లు.. వర్క్ డేస్ లోనూ ప్రదీప్ రంగనాథన్ జోరు!

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ ఫిల్మ్ 'డ్రాగన్'. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. 'డ్రాగన్' కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ప్రదీప్ రంగనాథన్ కెరీర్లో వంద కోట్ల క్లబ్ లో రెండో సినిమాగా చేరి 'డ్రాగన్' సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొదటి వారం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన ఈ చిత్రం ఇక రెండో వారంలోనూ కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. 2వ వారంలోనూ ఈ చిత్రం వసూళ్లు పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. చిన్న బడ్జెట్ సినిమాగా థియేటర్లలోకి వచ్చి.. వంద కోట్లు కొల్లగొట్టిందంటే మాములు విషయం కాదు.

ఈచిత్రం రిలీజ్ అయిన మొదటి రోజే రూ.6.5 కోట్ల వరకు నెట్ వసూల్ చేసింది. ఫస్ట్ వీక్ లో రోజుకు రూ.8 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ఆశ్చర్య పరిచింది. ఇక డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్, డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్లు, డే10న రూ.9కోట్ల నెట్ అందుకుంది. డే11న రూ.2.25 కోట్లు నెట్ అందుకుంది.

Pradeep Ranganathan Anupama Parameswaran Dragon Movie Day 12 Box Office Collections Worldwide

ఇక తండేల్ 12వ రోజు కూడా జోరుగానే వసూళ్లు సాధించింది. డే12న రూ.2.25 కోట్ల నెట్ అందుకుంది. ఇందులో తమిళంలో రూ.1.74 కోట్ల నెట్ వసూల్ చేయగా.. తెలుగులో రూ.46 లక్షలు అందుకుంది. మొత్తంగా ఈ చిత్రం ఇండియాలో రూ.77.4 కోట్ల వరకు నెట్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.114.35 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక ఇండియాలో రూ.86.85 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఓవర్సీస్ లో రూ.27.5 కోట్లు రాబట్టింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిందీ చిత్రం.

ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికే పదిరోజుల్లో 'డ్రాగన్' చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.111.00 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసి, ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రదీప్ రంగనాథన్ తమిళ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. వరుసగా తొలిరెండు 100 చిత్రాలను కలిగిన హీరోగా ముద్ర వేసుకున్నారు. డ్రాగన్ ఇంకా వసూళ్లు సాధిస్తోంది. ఎంత వరకు వసూళ్లు చేస్తుందనేది చూడాలి.

ఇక అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహార్ హీరోయిన్లుగా నటించారు. ప్రదీప్ రంగనాథ్ స్టూడెంట్ గా అలరించారు. ఇంజనీరింగ్ లో బ్యాక్ లాగ్స్ ఉన్న ప్రదీప్.. ఒక రిచ్ గర్ల్ కోసం బ్యాక్ డోర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వెతుకుంటాడు. ఆ తర్వాత ప్రదీప్ కు ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడనే అంశాలతో 'డ్రాగన్' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంతో హీరోయిన్ కయాదు లోహర్ కు మంచి పేరు వచ్చింది.

More from Filmibeat

Read more about: pradeep ranganathan dragon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X