Dragon Day 13 Collections : ‘డ్రాగన్’ 13వ రోజు కలెక్షన్లు.. రెండో వారంలో వసూళ్లు ఇలా!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తాజాగా 'డ్రాగన్' ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి వారం సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం సెకండ్ వీడ్ లోనూ అదరగొడుతున్నాడు ప్రదీప్. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజు వారీగా కలెక్షన్లు ఆశ్చర్య పరుస్తున్నాయి. వర్క్ డేస్ లో రూ.2 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తూ ఆశ్చర్యపరుస్తోందీ చిత్రం.
రిలీజ్ అయిన మొదటి రోజే 'డ్రాగన్' మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.6.5 కోట్ల వరకు నెట్ వసూల్ చేసింది. ఇక డే2 రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ వసూల్ చేసి ఆశ్చర్య పరిచింది. ఫస్ట్ వీక్ లో రోజుకు రూ.8 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ఆశ్చర్య పరిచింది. ఇక డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్లు, డే10న రూ.9కోట్ల నెట్ అందుకుంది. డే11న రూ.2.25 కోట్లు నెట్ అందుకుంది. డే12న 2.25 కోట్ల వరకు నెట్ వసూళ్లు చేసింది.

ఇక డే13న 'డ్రాగన్' వసూళ్ల విషయానికొస్తే.. రూ.2 కోట్ల వరకు వసూళ్లు అందుకుంది. ఇక తండేల్ 12వ రోజు కూడా జోరుగానే వసూళ్లు సాధించింది. డే12న రూ.2.25 కోట్ల నెట్ అందుకుంది. ఇందులో తమిళంలో రూ.1.74 కోట్ల నెట్ వసూల్ చేయగా.. తెలుగులో రూ.46 లక్షలు అందుకుంది. మొత్తంగా ఈ చిత్రం ఇండియాలో రూ.77.50 కోట్ల వరకు నెట్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.117.55 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక ఇండియాలో రూ.89.55 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఓవర్సీస్ లో రూ.28 కోట్లు గ్రాస్ రాబట్టింది. మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.
అయితే డ్రాగన్ మూవీ ఇప్పటి వరకు కేవలం తమిళంలో రూ.64.56 కోట్ల నెట్ వసూల్ చేసింది. తెలుగు స్టేట్స్ లో రూ.15.2 కోట్ల నెట్ అందుకుంది. రెండు స్టేట్స్ లో కలిపి రూ.79.76 కోట్ల నెట్ ఇండియాలో వసూల్ చేసింది. ఆక్యుపెన్సీ కూడా 50 శాతం వరకు నమోదవుతోంది. వీక్ డేస్ లో మాత్రం దుమ్ములేపుతోంది. కలెక్షన్లు కూడా ఐదు కోట్ల రూపాయాలకు పైగాన వసూళ్లు అవుతున్నాయి.

ఇక ఈ చిత్రాన్ని అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేశారు. హీరోయిన్లుగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహార్ అలరించారు. ఈ చిత్రంతో అనుపమా పరమేశ్వరన్ కంటే కయాదు లోహార్ కు మంచి పేరు దక్కింది. ప్రదీప్ రంగనాథ్ నటనకు ప్రశంసలు అందుతున్నాయి. ఈ చిత్రంతో రెండో సారి రూ.100 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











